తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరిగిన బంగారం ధర

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 31, Aug 2018, 4:31 PM IST
Gold Prices Jump By Rs. 140: 5 Things To Know
Highlights

 స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ పెరగడం, అంతర్జాతీయంగానూ సానుకూల పరిస్థితులు ఉండటంతో బంగారం ధర పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.
 

బంగారం ధర తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కారణంగా ఆమధ్య బంగారం ధర స్వల్పంగా తగ్గినట్టు కనిపించింది. కాగా.. మళ్లీ పసిడి కి రెక్కులు వచ్చాయి. వరసగా రెండో రోజు పసిడిధర పెరిగింది.

గురువారం రూ.120 పెరిగిన పసిడి ధర.. శుక్రవారం మరో రూ.140 పెరిగింది. కొనుగోళ్లు ఊపందడంతోనే బంగారం ధర పెరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రూ.140 పెరిగి పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.31,340కి చేరింది. స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ పెరగడం, అంతర్జాతీయంగానూ సానుకూల పరిస్థితులు ఉండటంతో బంగారం ధర పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా రెండో రోజు కూడా వెండి ధరలో ఎటువంటి మార్పులు లేవు. కేజీ వెండి ధరలో ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా రూ.38,400గా ఉంది. నిన్న కూడా వెండి ధర ఇదే విధంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. సింగపూర్‌ మార్కెట్‌లో 0.60 పెరగడంతో ఔన్సు 1,206.80 డాలర్లు పలికింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ నేడు రూ.71కి చేరి జీవనకాల గరిష్ఠానికి చేరడంతో దిగుమతి వ్యయం పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు.

loader