బంగారం ధరలు ఒక్కరోజులో 2% తగ్గాయి. భారత్‌లోనూ శనివారం తర్వాత తగ్గుదల కనిపించే అవకాశముంది.
శనివారం నాటికి దేశవ్యాప్తంగా బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. శుక్రవారం పది గ్రాముల బంగారం ధర రూ.1,00,450గా ఉండగా, శనివారం నాటికి ఇది రూ.1,050 తగ్గి రూ.99,400కు చేరింది. ఇదే సమయంలో వెండి ధరలోనూ స్వల్పంగా తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధర శుక్రవారం రూ.1,08,130గా ఉండగా, శనివారం నాటికి రూ.55 తగ్గి రూ.1,08,075గా నమోదైంది.
మార్కెట్ ప్రారంభానికి…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధరలు నమోదు అయ్యాయి. హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం రూ.99,400 కాగా, కిలో వెండి రూ.1,08,075 ఉంది. విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు వంటి నగరాల్లో కూడా ఈ ధరలే అమలులో ఉన్నాయి. ఇవి ఉదయం మార్కెట్ ప్రారంభానికి సమయాన ఉన్న రేట్లు. మార్కెట్‌లో డిమాండ్, సరఫరా ఆధారంగా ఇవి మారవచ్చు.
అంతర్జాతీయంగా కూడా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఔన్స్ గోల్డ్ ధర 3,370 అమెరికన్ డాలర్లు ఉండగా, శనివారం నాటికి ఇది 60 డాలర్లు తగ్గి 3,310 డాలర్లకు దిగొచ్చింది. అంతేకాకుండా, ఔన్స్ వెండి ధర ప్రస్తుతం 36.00 డాలర్లుగా ఉంది.
మొత్తానికి దేశీయంగా, అంతర్జాతీయంగా రెండు విలువైన లోహాల ధరలు తగ్గడం గమనార్హం. కొనుగోలుదారులు తమ అవసరాలను అనుసరించి తాజా రేట్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.