Asianet News TeluguAsianet News Telugu

వరుసగా 2వ రోజు తగ్గిన బంగారం.. కొనేందుకు మంచి ఛాన్స్.. ఎంత తగ్గిందంటే..?

భారతదేశంలోని ప్రధాన నగరాలలో కూడా బంగారం ధరలలో హెచ్చుతగ్గులను నమోదు చేశాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ.47,927గా ఉంది.

 Gold prices continue to fall for 2nd consecutive day in India check updated rates on 7 January
Author
First Published Jan 7, 2023, 9:59 AM IST

ఈ రోజు జనవరి 7 నాటికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 55,590 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,920గా ఉంది. భారతదేశంలో శనివారం 24 క్యారెట్లు అండ్ 22 క్యారెట్ల ధరలలో కాస్త తగ్గుదల కనిపించింది.

భారతదేశంలోని ప్రధాన నగరాలలో కూడా బంగారం ధరలలో హెచ్చుతగ్గులను నమోదు చేశాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ.47,927గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,680 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ. 51,050. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర బంగారం ధర రూ. 55,530 కాగా, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ. 50,900. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.55,530 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,900గా ఉంది.

మరోవైపు హైదరాబాద్ లో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,900 గాఉంది అయితే నిన్నటి ధరతో పోలిస్తే పసిడి ధర తగినట్టుగా కనిపిస్తుంది.  24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.55, 960గా ఉండగా నేడు రూ.55,530గా ఉంది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే బంగారం ధర నేడు క్షీణించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios