Asianet News TeluguAsianet News Telugu

పసిడి ప్రియులకి కలిసొచ్చిన న్యూ ఇయర్.. నేడు స్థిరంగా బంగారం, వెండి..

యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి 2,077.40 డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ అయిన SPDR గోల్డ్ ట్రస్ట్ గురువారం నాడు 880.55 టన్నుల నుండి శుక్రవారం నాడు 0.16 శాతం పడిపోయి 879.11 టన్నులకు పడిపోయింది.
 

Gold price unchanged at Rs 63,870, silver price unchanged at Rs 78,600-sak
Author
First Published Jan 2, 2024, 10:34 AM IST

ఒక  నివేదిక  ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో ఎటువంటి మార్పు లేకుండా ఉంది, దింతో పది గ్రాముల ధర రూ. 63,870 వద్ద ఉంది. వెండి ధర కూడా ఎటువంటి మార్పు లేకుండా ఒక కిలో ధర రూ.78,600గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా 10 గ్రాములకి రూ. 58,550 వద్ద ఉంది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,870గా ఉంది.

కోల్‌కతాలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,870గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.63,970,

బెంగళూరులో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,870, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.64,470గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,550 వద్ద ఉంది.

కోల్‌కతాలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,550 వద్ద ఉంది. 

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,700, 

బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,550,

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,100గా ఉంది. 

 0129 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.3 శాతం పెరిగి ఔన్సుకు $2,068.29 వద్ద ఉంది. బులియన్ ధరలు 2023లో 13 శాతం లాభపడి 2020 తర్వాత మొదటి వార్షిక లాభాలను నమోదు చేశాయి.

యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి 2,077.40 డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ అయిన SPDR గోల్డ్ ట్రస్ట్ గురువారం నాడు 880.55 టన్నుల నుండి శుక్రవారం నాడు 0.16 శాతం పడిపోయి 879.11 టన్నులకు పడిపోయింది.

గత వారం భారతదేశంలో ఫిజికల్ గోల్డ్ డిమాండ్ మందగించింది, ఎందుకంటే స్థానిక ధరలు దాదాపు రికార్డు స్థాయికి చేరుకోవడంతో సంవత్సరాంతపు సెలవుల సమయంలో కొనుగోలుదారులను నిరుత్సాహపరిచింది.

స్పాట్ వెండి ఔన్స్‌కు 0.5 శాతం పెరిగి 23.88 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 987.61 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. పల్లాడియం 0.9 శాతం పడిపోయి $1,088.82కి చేరుకుంది. ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.78,600గా ఉంది.

 విజయవాడలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి . ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,550గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ధర రూ. 63,870. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ. 80,000.

 హైదరాబాద్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,550గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,870. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ.80,000.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, అలాగే ఎప్పుడైనా ధరలు మారవచ్చు. అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios