Asianet News TeluguAsianet News Telugu

బంగారం, వెండి కొంటున్నారా.. అయితే కొనేముందు నేడు ధరలు పెరిగాయా తగ్గాయా తెలుసుకోండి..

నేడు స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1746 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ ఔన్సుకు 20.78 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.66 వద్ద ఉంది. 
 

Gold Price Today: Stability in gold silver prices in hyderabad know today's price
Author
First Published Nov 21, 2022, 10:13 AM IST

ప్రపంచ స్థాయిలో నేడు బంగారం-వెండి ధరలో హెచ్చుతగ్గులు  చోటుచేసుకున్నాయి. సాధారణంగా 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు, అయితే ఈ బంగారం చాలా మృదువైనది కాబట్టి దీనితో నగలు తయారు చేయలేరు. అందుకే నగలు లేదా ఆభరణాల తయారీలో ఎక్కువగా 22 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే ఉపయోగిస్తారు.

నేడు స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1746 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ ఔన్సుకు 20.78 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.66 వద్ద ఉంది. 

ఏ క్యారెట్ బంగారం స్వచ్ఛమైనది
24 క్యారెట్ల బంగారం 99.9 శాతం.
23 క్యారెట్ల బంగారం 95.8 శాతం.  
22 క్యారెట్ల బంగారం 91.6 శాతం.
21 క్యారెట్ల బంగారం 87.5 శాతం.
18 క్యారెట్ల బంగారం 75 శాతం.
17 క్యారెట్ల బంగారం 70.8 శాతం.  
14 క్యారెట్ల బంగారం 58.5 శాతం.
9 క్యారెట్ల బంగారం 37.5 శాతం.

నేడు బంగారం ధరలు  అంటే 21 నవంబర్ 2022న హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో ధరలు కాస్త దొగోచ్చాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,600గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ . 53,020గా ఉంది.

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,600, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,020.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,600, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,020. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి  ధర రూ. 48,600, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,020.

మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 67,500గా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios