Asianet News TeluguAsianet News Telugu

బంగారం, వెండి షాపింగ్ చేస్తున్నారా.. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ఎంతంటే..?

ఈ రోజు భారతదేశంలోని ప్రముఖ నగరాలలో బంగారం ధరల్లో మార్పులను నమోదు చేశాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927గా ఉంది.

Gold Price Today on 19 January 2023: Gold Silver Slipped From Upper Levels Know What Are Rates Of 22 Kt Gold In Your City Today-sak
Author
First Published Jan 19, 2023, 11:01 AM IST

నేడు ఉదయం 10:09 గంటలకు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం 0.04 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.56,310 వద్ద, వెండి కిలో 0.41 శాతం తగ్గి రూ.67,950 వద్ద ట్రేడవుతోంది.

0028 GMT నాటికి స్పాట్ బంగారం 0.2 శాతం పెరిగి ఔన్సుకు $1,907.18 డాలర్ల వద్ద, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం పెరిగి $1,909.40 డాలర్లకి చేరుకుంది. స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.1% లాభపడి $23.44 డాలర్లకి చేరుకుంది, ప్లాటినం $1,038.31 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది, పల్లాడియం $1,718.61 డాలర్ల వద్ద మారలేదు.
 
ఈ రోజు భారతదేశంలోని ప్రముఖ నగరాలలో బంగారం ధరల్లో మార్పులను నమోదు చేశాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 56,890 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 52,150. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 56,730 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 52,200. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.56,730 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.52,000గా ఉంది.

హైదరాబాద్ తో పాటు బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో  కూడా ఈ రోజు పసిడి ధరలు తగ్గాయి. బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 200 పతనంతో  రూ. 52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 220 పతనంతో రూ. 56,730.

హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాములకు  రూ. 200 పతనంతో  రూ. 52,000 చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పతనంతో రూ. 56,730గా ఉంది.  కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,730. విశాఖపట్నంలో బంగారం ధరలు10 గ్రాముల 22 క్యారెట్లకు  రూ. 52,000, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,730. 

మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 74,800గా ఉంది. రాష్ట్రాలు విధించే పన్నులు, ఎక్సైజ్ సుంకం, వివిధ మేకింగ్ ఛార్జీల కారణంగా బంగారు ఆభరణాల ధరలు దేశవ్యాప్తంగా భిన్నంగా ఉంటాయి.

Follow Us:
Download App:
  • android
  • ios