Gold Price Today: బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ఆభరణాల షాపుల్లో సేల్స్ కూడా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఫెస్టివల్ సీజన్ రానున్న నేపథ్యంలో పసిడి కొనుగోలు దారులు పండగ చేసుకుంటున్నారు.
Gold Price Today: వరుసగా నాలుగు వారాలుగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈ వారం స్వల్పంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ వారం బంగారం ధరలు 52 వేలకు తగ్గింది. దీంతో పాటు గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ వారం చివరి రోజున భారత మార్కెట్‌లో బంగారం ధరలు 10 గ్రాముల ధర రూ.51,868 వద్ద ముగిసింది. ఈ వారం ప్రారంభం నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం 10 గ్రాముల బంగారం ధర రూ.52,481 వద్ద ముగిసింది.
ఈ వారం బంగారం ధర తగ్గింది
గత వారం ట్రేడింగ్ డే మంగళవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజే బంగారం ధరలు తగ్గుముఖం పట్టి 10 గ్రాముల ధర రూ.52,180కి చేరింది. దీని తర్వాత, వారం పొడవునా బంగారం ధరలు తగ్గాయి. గురువారం 52 వేల నుంచి దిగివచ్చి 10 గ్రాములకు రూ.51,974 వద్ద ముగిసింది. మరోవైపు శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.51,868 వద్ద ముగిసింది. ఆదివారం కూడా ఇవే ధరలు కంటిన్యూ కానున్నాయి.
బంగారం ఎంత చౌక
ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) ప్రకారం గత వారంతో పోలిస్తే ఈ వారం బంగారం ధరలు రూ.613 తగ్గాయి. గ్లోబల్ మార్కెట్ గురించి మాట్లాడుతూ, శుక్రవారం, బంగారం ధర 0.2 శాతం పడిపోయింది. ఔన్స్ బంగారం ధర 1753.97 డాలర్ల వద్ద ఉంది. బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో 1730 డాలర్లకు పడిపోవచ్చని చెబుతున్నారు.
24 క్యారెట్ల బంగారం ధర
ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) ప్రకారం ఆగస్టు 19న 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,868గా ఉంది. కాగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.51,660గా ఉంది. అయితే ఇందులో జీఎస్టీ చార్జీలు లేవని గమనించాలి. ఇందకోసం మీరు ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు ప్రత్యేకంగా చెల్లించాలి. మీరు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే, పన్నుతో పాటు మేకింగ్ ఛార్జీలను సైతం ఆభరణాల షాపలు వేస్తాయి. దీంతో ఆభరణాల ధరలు ఎక్కువగా ఉంటాయని గమనించాలి. అలాగే ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో హాల్ మార్క్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా గమనించాలి.
బంగారం ధరలు తగ్గుతున్నాయి
మీరు బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయాలనుకుంటే, దీని కోసం ప్రభుత్వం 'బిఐఎస్ కేర్ యాప్'ని రూపొందించింది. దాని సహాయంతో మీరు బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయవచ్చు. నగల స్వచ్ఛతను కొలవడానికి ఇది ఒక మార్గం. ఇందులో హాల్‌మార్క్‌కు సంబంధించిన అనేక రకాల మార్కులు కనిపిస్తాయి. ఈ గుర్తుల ద్వారా నగల స్వచ్ఛత గుర్తించవచ్చు.
