Asianet News TeluguAsianet News Telugu

పండుగ రోజున షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. తొలిసారిగా అల్ టైం హైకి.. ఒక్కరోజే ఎంత పెరిగిందంటే..?

గ్లోబల్ మార్కెట్లలో ధృడమైన ధోరణి మధ్య, జాతీయ రాజధాని బులియన్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధరలు 10 గ్రాములకు రూ.121 పెరిగి రూ.56,236కి చేరుకున్నాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.56,115 వద్ద ముగిసింది. 

Gold Price Today: Gold made cry For the first time price crossed rs 56,300 this is the rate of 10gm gold
Author
First Published Jan 14, 2023, 11:54 AM IST

నేడు పసిడి ధర చరిత్రలోనే గరిష్ట స్థాయికి చేరుకుంది. గత కొన్ని వారాలుగా స్థిరమైన పెరుగుదలను చూస్తున్న బంగారం ధరలు  శుక్రవారం తొలిసారిగా 56,360 స్థాయిని తాకాయి. గత ఏడాది ఆగస్టు 2020లో బంగారం ధర రూ.56,200 స్థాయిని దాటింది. పెరుగుతున్న ధరల దృష్ట్యా ప్రభుత్వం బంగారం దిగుమతిపై బేస్ ధరను నిర్ణయించింది.  మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో, గోల్డ్ ఫ్యూచర్స్ రూ. 466 లేదా 0.83% పెరిగి 10 గ్రాములకు రూ.56,341కి చేరుకుంది.  సిల్వర్ ఫ్యూచర్ మరోసారి రూ.70,000 స్థాయికి చేరువైంది. 

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఎంత?
గ్లోబల్ మార్కెట్లలో ధృడమైన ధోరణి మధ్య, జాతీయ రాజధాని బులియన్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధరలు 10 గ్రాములకు రూ.121 పెరిగి రూ.56,236కి చేరుకున్నాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.56,115 వద్ద ముగిసింది. అయితే కిలో వెండి ధర రూ.145 తగ్గి రూ.68,729 వద్ద ముగిసింది.

IBJA (ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేటన్ లిమిటెడ్)లో వివిధ క్యారెట్ల బంగారం, వెండి ధరలు
బంగారు ఆభరణాల అమ్మకపు రేటు
- ఫైన్ గోల్డ్ (999)- 5,646
- 22 KT- 5,511
- 20 KT- 5,025
- 18 KT- 4,573
- 14 KT- 3,642
- వెండి (999)- 68,115

(ఈ బంగారం ధరలకు GST ఇంకా వాటికి మేకింగ్ ఛార్జీలు జోడించలేదు.)

బంగారం దిగుమతి: బంగారం దిగుమతిపై పెద్ద వార్త
విదేశీ మార్కెట్లలో పెరుగుతున్న లోహాల ధరల దృష్ట్యా, ప్రభుత్వం బంగారంపై బేస్ దిగుమతి ధరను 10 గ్రాములకు $ 584 నుండి $ 606 కు పెంచింది, వెండిపై బేస్ దిగుమతి ధరను కిలోకు $ 779 నుండి $ 770 కు తగ్గించింది. దేశీయ మార్కెట్‌లో ధరలను ప్రపంచ మార్కెట్‌తో సమానంగా ఉంచేందుకు ప్రభుత్వం ప్రతి 15 రోజులకోసారి బేస్ దిగుమతి ధరను సమీక్షిస్తుంది.

బంగారం అంతర్జాతీయ ధర: విదేశీ మార్కెట్‌లో ధరలు
విదేశీ మార్కెట్లలో, బంగారం ఔన్సుకు $ 1,921.70 వద్ద వేగంగా ట్రేడవుతోంది. వెండి ధర ఔన్స్‌కు 24.372 డాలర్లుగా నమోదైంది.

ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల బంగారం ధర రూ.51,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,290 వద్ద కొనసాగుతోంది.

దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.51,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,290గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,650 కాగా, 24 క్యారెట్ల  బంగారం ధర రూ.56,340గా కొనసాగుతోంది

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.52,500 ఉండగా, 24 క్యారెట్ల  బంగారం ధర రూ.57,250గా ఉంది.

విశాఖలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.51,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,340గా  ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల  బంగారం ధర రూ.51,600గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ.56,340వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‎లో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ. 200 పెరిగి ప్రస్తుతం రూ.51,600 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పసిడి ధర  ఏకంగా 10 గ్రాములకు రూ.220 పెరిగి ప్రస్తుతం రూ.56,290 ఉంది. 

వెండి ధరలు చూస్తే  న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,000, ముంబైలో కిలో వెండి ధర రూ.72,000,  విజయవాడ‎లో కిలో వెండి ధర రూ.74,000
 

Follow Us:
Download App:
  • android
  • ios