ఈ వారం ప్రారంభంలో బంగారం ధరలు కాస్త హెచ్చుతగ్గులను కొనసాగించినట్లు కనిపిస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.47,650గా ఉండగా, పూణెలో రూ.46,970గా ఉంది
భారత్‌లో బంగారం ధర సోమవారం తగ్గుముఖం పట్టింది. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో జూలై 11న 09:05 గంటల సమయానికి 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ 0.10 శాతం తగ్గి రూ. 50,726కి చేరుకుంది. సోమవారం సిల్వర్ ఫ్యూచర్స్ 0.14 శాతం తగ్గి కిలోకి రూ. 57,050కి పడిపోయింది. పెరుగుతున్న డాలర్ విలువ పసిడిని ఒత్తిడిలో ఉంచింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 0.10 శాతం తగ్గి $1,740.16 చేరింది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గి $1,739.50కి చేరాయి. డాలర్ దాదాపు 20 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరుకుంది. బెంచ్‌మార్క్ US 10-సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్‌లు శుక్రవారం ఒక వారం గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. యూరోపియన్ యూనియన్‌లో అధిక ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలు, ఇంధన సంక్షోభం కారణంగా యూరో గత రెండు దశాబ్దాలలో కనిష్ట స్థాయికి పడిపోయింది.
ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ SPDR గోల్డ్ ట్రస్ట్ గత గురువారం నాడు 1024.43 టన్నుల నుంచి శుక్రవారం నాటికి 0.11 శాతం తగ్గి 1023.27 టన్నులకు పడిపోయిందని తెలిపింది.
ఢిల్లీలో ఈ రోజు ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,950 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51, 210.
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,950 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,210.
చెన్నైలో ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 46,890, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 51,150.
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,950, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,210
ఇక్కడ పేర్కొన్న ధరలు స్థానిక ధరలకు సమానంగా ఉండకపోవచ్చు. కాబట్టి ముందుగా సంప్రదించి కొనుగోలు చేయడం ఉత్తమం.
హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,980.
