Asianet News TeluguAsianet News Telugu

పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఒక్క నెలలో ఎంత పెరిగిందంటే..?

ఒక వెబ్ సైట్ ప్రకారం, మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధరలు రూ.280 పెరిగి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.57,440 వద్ద ట్రేడవుతోంది. అలాగే  1 కిలో వెండి ధర రూ.71,200 వద్ద మారలేదు. 

Gold Price Today 7 Feb: Gold edges up dollar softens traders eye Fed Chair Jerome Powells speech
Author
First Published Feb 7, 2023, 11:24 AM IST

నేడు మిశ్రమ ప్రపంచ సంకేతాలు ఉన్నప్పటికీ బంగారం ధర అధికంగా ట్రేడవుతోంది, వెండి ధర 0.22% తగ్గింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 366 లేదా 0.65% పెరిగి రూ.56,951 వద్ద ట్రేడవుతున్నాయి. సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ కిలోకు రూ.147 తగ్గి రూ.67,429గా ట్రేడవుతున్నాయి.  

ఒక వెబ్ సైట్ ప్రకారం, మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధరలు రూ.280 పెరిగి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.57,440 వద్ద ట్రేడవుతోంది. అలాగే  1 కిలో వెండి ధర రూ.71,200 వద్ద మారలేదు. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగి రూ.52,650 వద్ద ట్రేడవుతోంది.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లో  52,650 వద్ద ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో రూ.52,800,  చెన్నైలో రూ.53,650, బెంగళూరులో  రూ.52,700గా ఉంది.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్, కోల్‌కతా, ముంబైలో  సమానంగా రూ.57,440గా ఉంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  ఢిల్లీలో రూ.57,590, చెన్నైలో రూ.58,530,  బెంగళూరులో రూ.57,490గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.57,440. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.52,650, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.57,440. కేరళ, విజయవాడలో కిలో వెండి ధర రూ.74,000. జనవరి నెల మొత్తంగా చూస్తే బంగారం ధర ఏకంగా రూ.2200 వరకు ఎగిసింది.

0316 GMT నాటికి స్పాట్ బంగారం 0.4 శాతం పెరిగి ఔన్సుకు $1,873.96 వద్ద, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం పెరిగి $1,886.60 డాలర్లకి చేరుకుంది.   ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.758 వద్ద స్థిరంగా ఉంది. 

స్పాట్ వెండి ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి $22.33 డాలర్లకు, ప్లాటినం 0.1 శాతం తగ్గి $970.94 డాలర్లకు, పల్లాడియం 0.1 శాతం తగ్గి $1,596.74 డాలర్లకు చేరుకుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.71,200గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర రూ.74,000గా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios