Asianet News TeluguAsianet News Telugu

నేడు బంగారం కొనేందుకు మంచి సమయమా.. ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉందా.. నేటి ధరలు ఇవే..

ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1872 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ $22.34 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.630 వద్ద ఉంది. ఆర్‌బి‌ఐ రెపో రేటును పెంచడం ఇప్పుడు వరుసగా 6వసారి కావడం గమనార్హం. దీంతో మొత్తం రెపో రేటు 6.50 శాతానికి చేరింది. 

Gold price in India marginally increase for 24 carat and 22 carat today check latest rates here
Author
First Published Feb 9, 2023, 9:15 AM IST

  గత 24 గంటల్లో బంగారం ధరలు ఎగిశాయి. ఫిబ్రవరి 9 నాటికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 57,540 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,700. 24 క్యారెట్లు, 22 క్యారెట్ల ధరలు నేడు రూ.180  వరకు పెరిగాయి.

ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1872 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ $22.34 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.630 వద్ద ఉంది.

ఆర్‌బి‌ఐ రెపో రేటును పెంచడం ఇప్పుడు వరుసగా 6వసారి కావడం గమనార్హం. దీంతో మొత్తం రెపో రేటు 6.50 శాతానికి చేరింది. గతేడాది మే నుంచి రెపో రేటును ఏకంగా 250 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.

భారతదేశంలోని ప్రముఖ నగరాల్లో బంగారం ధరల్లో  నేడు హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,927గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,700 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,900. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,750. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,550 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,750గా ఉంది.

భువనేశ్వర్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 57,550 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల  ధర రూ. 52,750.

హైదరాబాద్ విషయానికి వస్తే బంగారం, వెండి ధరలు  22 క్యారెట్ల  10 గ్రాముల  ధర రూ.52,750 వద్ద, 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 57,550 వద్ద ట్రేడవుతోంది.  

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550. విశాఖపట్నంలో బంగారం ధరలు  22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 74,000.

Follow Us:
Download App:
  • android
  • ios