ఆర్థిక అవసరాలు ఎప్పుడు ఏ సందర్భంలో వస్తాయో తెలియని పరిస్థితి ఉంటుంది. ఒక్కో కొద్ది మొత్తంలోనే మనకు డబ్బు అవసరం అవుతుంది. కానీ ఆ మొత్తం మనకు సర్దుబాటు కాదు. అలాంటి సమయంలో బంగారాన్ని  తాక‌ట్టుపెట్టి మనకు కావాల్సినంత నగదు తీసుకోవ‌చ్చు. నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిలో దాన్ని తిరిగి చెల్లించి బంగారాన్ని తిరిగి  తెచ్చుకోవ‌చ్చు.  క్రెడిట్ స్కోరుతో సంబంధం లేకుండా బంగారంపై రుణాలు సులభంగా లభిస్తాయి. 

తక్షణమే రుణం కావాలంటే మనకు గుర్తుకువచ్చేది బంగారమే, దేశంలోని పలు బ్యాంకులు, NBFCలు ఈ గోల్డ్ లోన్ సర్వీసులు అందిస్తున్నాయి. కొన్ని NBFCలు తక్షణమే రుణాలను అందిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం తక్కువ వడ్డీకి రుణాలను అందిస్తున్నాయి. 

గోల్డ్ లోన్ ద్వారా ఇంట్లో ఉంచిన బంగారంపై లోన్ తీసుకోవచ్చు. అయితే గోల్డ్ లోన్ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రుణం తిరిగి చెల్లించకపోతే బంగారం ఆభరణాలు జప్తు చేస్తారు. అయితే దీని వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. గోల్డ్ లోన్ కు సిబిల్ స్కోర్ లాంటివి చూడరు. కేవలం బంగారం పరిమాణం, క్వాలిటీ మాత్రమే బేరీజు వేసి లోన్ ఇస్తారు. 

ఏ బ్యాంకుల బంగారు రుణాలు చౌకగా మరియు అత్యంత పొదుపుగా ఉంటాయో ఇక్కడ మేము మీకు తెలియజేస్తున్నాము-

ఈ బ్యాంకులు తక్కువ ధరకే బంగారు రుణాన్ని ఇస్తున్నాయి
>> ఫెడరల్ బ్యాంక్ (Federal Bank) తన కస్టమర్లకు 6.99 శాతం వడ్డీ రేటుతో చౌకైన బంగారు రుణాన్ని అందిస్తోంది.
>> దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI (SBI) 7 శాతం వడ్డీతో బంగారు రుణాలను అందిస్తోంది.
>> పంజాబ్ & సింధ్ బ్యాంక్ (Punjab & Sind Bank)కూడా 7 శాతం వడ్డీ రేటుతో బంగారు రుణాన్ని అందిస్తోంది.
>> పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) 7.25 శాతం వడ్డీకి గోల్డ్ లోన్ సదుపాయాన్ని అందిస్తోంది.
>> కెనరా బ్యాంక్‌ (Canara Bank)లో 7.35 శాతం చొప్పున గోల్డ్ లోన్ అందుబాటులో ఉంది.
>> ఇండియన్ బ్యాంక్ (Indian Bank)తన కస్టమర్లకు 8 శాతం గోల్డ్ లోన్ ఇస్తోంది.
>> బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) 8.40 శాతం వద్ద గోల్డ్ లోన్ సౌకర్యాన్ని అందిస్తోంది.
>> మీరు 8.49 శాతం రేటుతో కర్ణాటక బ్యాంక్ (Karnataka Bank)నుండి గోల్డ్ లోన్ తీసుకోవచ్చు.
>> యూకో బ్యాంక్ (Uco Bank) నుండి 8.50 శాతం చొప్పున గోల్డ్ లోన్ లభిస్తుంది.
>> మీరు 8.50 శాతం వడ్డీ రేటుతో HDFC బ్యాంక్ నుండి గోల్డ్ లోన్ తీసుకోవచ్చు.

తాకట్టు పెట్టిన బంగారం విలువలో 75 శాతం వరకు నిధులు గోల్డ్ లోన్‌గా తీసుకోవచ్చు. మీ బంగారం స్వచ్ఛత మరియు ఇతర ప్రమాణాల పై ఆధారపడి బంగారం వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది.

బంగారు రుణాలను తిరిగి చెల్లించే సమయంలో ముందుస్తు చెల్లింపులు చేసి మీ ఆభరణాలను విడిపించుకోవచ్చు. చాలా సంస్థ‌లు గోల్డ్ లోన్ ముంద‌స్తు చెల్లింపుల‌పై ఛార్జీలు విధించ‌డం లేదు. కొన్ని బ్యాంకులు అటువంటి ఛార్జీలు విధించిన్నప్పటికీ, అది మొత్తం రుణంలో కేవలం ఒక శాతంగా మాత్రమే ఉంటుంది. వాల్యుయేషన్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు కూడా ఉండే వీలుంది.

ఇక రుణాన్ని తిరిగి చెల్లించే క్రమంలో సంస్థ రూల్స్ ను బట్టి ఆప్షన్స్ ఉంటాయి. రుణ చెల్లింపులను నెలవారీ వాయిదాల్లో (EMI) చెల్లించొచ్చు. కొన్ని సార్లు కేవలం వడ్డీ చెల్లించి, చివరకు మొత్తం చెల్లించే విధానం కూడా ఉంటుంది. 

బంగారు నగల ద్వారా రుణం తీసుకోవడం సురక్షితం అని కూడా నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద కన్నా కూడా బ్యాంకులు, NBFCల వద్ద రుణాలు తీసుకోవడం సురక్షితమని సూచిస్తున్నారు. మీ ఆభరణాలు కూడా సురక్షితంగా ఉంటాయని సూచిస్తున్నారు.