Asianet News TeluguAsianet News Telugu

అక్షయతృతీయ రోజున తగ్గిన బంగారం ధరలు! 25% పెరిగిన సేల్స్

అక్షయ తృతీయరోజున దేశ వ్యాప్తంగా బంగారం దుకాణాలు కస్టమర్లతో కళకళలాడాయి. ఈ పర్వదినాన బంగారం కొంటే మంచి జరుగుతుందనే నమ్మకం ఉండటంతో పెద్ద సంఖ్యలో ప్రజలు బంగారం కొనుగోళ్లు చేపట్టారు. ఇందుకు బంగారం ధరలు కూడా కలిసి వచ్చాయి. 

Gold finally sparkles this Akshaya Tritiya, sales up over 25%
Author
New Delhi, First Published May 8, 2019, 10:40 AM IST

అక్షయ తృతీయరోజున దేశ వ్యాప్తంగా బంగారం దుకాణాలు కస్టమర్లతో కళకళలాడాయి. ఈ పర్వదినాన బంగారం కొంటే మంచి జరుగుతుందనే నమ్మకం ఉండటంతో పెద్ద సంఖ్యలో ప్రజలు బంగారం కొనుగోళ్లు చేపట్టారు. ఇందుకు బంగారం ధరలు కూడా కలిసి వచ్చాయి. 

గత రెండ్రోజులుగా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. అక్షయతృతీయనాడు(మంగళవారం) దిగివచ్చాయి. ధరలు స్థిరంగా ఉండటంతో గత ఏడాది కంటే కూడా ఈసారి విక్రయాలు 25శాతం అధికంగా జరిగాయని దుకాణాల యజమానులు పేర్కొంటున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 50 తగ్గడంతో రూ. 33,720 నుంచి రూ. 32,670కి చేరింది. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే నడిచింది. కిలో వెండి ధర రూ. 10 తగ్గి.. రూ. 38,130 నుంచి రూ. 38,120కి చేరింది. 

ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 32,670 వద్ద ట్రేడ్ అవుతుండగా.. 22 క్యారెట్ల బంగారం.. రూ. 32,500గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ధరలు 24 క్యారెట్ల బంగారానికి రూ. 32,920గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం రూ. 30,220గా ఉంది. 

విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి. కిలో వెండి ధర రూ. 39,600గా ఉంది. సార్వత్రిక పసిడి పథకంలో 8గ్రాముల బంగారం ధర రూ. 26,400 వద్ద స్థిరంగా ఉంది. ఇక న్యూయార్క్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర రూ. 1282.2 డాలర్లు ఉండగా, వెండి రూ. 14.92 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 

మరో వైపు బంగారం ధరల బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండి ధర రూ. 38,120 వద్ద కొనసాగుతోంది. 100 వెండి నాణేలు రూ. 79,000 ఉండగా.. అమ్మకం ధర రూ. 80,000గా ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios