Asianet News TeluguAsianet News Telugu

పండుగ సీజన్‌లో కానరాని పసిడి శోభ

అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధ ప్రభావంతో పసిడి ధరలు ధగధగమని మెరిసినా తాజాగా బంగారం కొనుగోళ్లపై గ్రామీణులు ఆసక్తి చూపలేదని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. 2008 నుంచి ఇప్పటి వరకు వరుసగా అధిక రిటర్న్స్ తెచ్చి పెట్టిన పసిడి ఈ దఫా ఇన్వెస్టర్లకు షాకివ్వబోతున్నదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.

GOLD FALLS TO ONE-MONTH LOW ON STRONG US
Author
Mumbai, First Published Nov 12, 2018, 3:15 PM IST

ముంబై: కొన్నేళ్లుగా అధిక రిటర్న్స్ పంచిన పసిడి ఈసారి పెట్టుబడిదారులకు షాకివ్వబోతున్నది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అతి విలువైన లోహాల ధరల్లో ప్రతికూల వృద్ధి నమోదు కానున్నదని బులియన్, జ్యువెల్లరీ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే దేశీయంగా ఇప్పటి వరకు రైతులకు కనీస మద్దతు ధర లభించకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోళ్లు మందగించాయని, ప్రస్తుత పండుగ సీజన్‌లో కూడా పెద్దగా పురోగతి సాధించలేదని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం 71 స్థాయిలో కదలాడితేనే పది గ్రాముల బంగారం ధర రూ.33,500గా ఉంటుందని భావిస్తున్నారు. శుక్రవారం బులియన్ మార్కెట్ ముగిసి సమయానికి పది గ్రాముల బంగారం ధర రూ.31,015కి, గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం 1,207.70 డాలర్లు పలికింది. 

గరిష్ఠ స్థాయికి చేరుకున్న ధరలు, రిటర్న్స్‌లో మందగమనం చేస్తుండటంతో దేశవ్యాప్తంగా అతి విలువైన లోహాలకు భారీ స్థాయిలో డిమాండ్ నెలకొనే అవకాశాలు కనిపించడం లేదని కామట్రెండ్జ్ రిస్క్ మేనేజ్‌మెంట్స్ డైరెక్టర్ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ తెలిపారు. మరోవైపు డాలర్ బలపడుతుండటం, జూన్ నుంచి ఆర్బీఐ వడ్డీరేట్లను రెండుసార్లు పెంచడం, వచ్చే నెలలో మరోసారి పెంచుతుందన్న భయాలు బులియన్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి.

పలు ప్రాంతాల్లో రాజకీయ అస్థిరత పరిస్థితులు నెలకొన్నా బంగారం ధరలపై ఎలాంటి ప్రభావం చూపవని కామట్రెండ్జ్ రిస్క్ మేనేజ్‌మెంట్స్ డైరెక్టర్ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ స్పష్టంచేశారు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,185-1,255 డాలర్ల మధ్యలో కదలాడనున్నది. ఒక వేళ డిమాండ్ అధికంగా ఉంటే వచ్చే నెల చివరినాటికి 1,275 డాలర్లకు, డిమాండ్ లేకపోతే 1,160 డాలర్లకు పడిపోవచ్చు. దేశీయంగా పది గ్రాముల బంగారం ధర రూ.30,250 నుంచి రూ.33,500 మధ్యలోనే కొనసాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. 

అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధమేఘాలతో గడిచిన రెండు నెలల్లో పసిడి ధరలు భారీగా పుంజుకున్నాయి. ఆ తర్వాత అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచడంతో ధరలు ఒక శాతానికి పైగా దిగువముఖం పట్టాయి. సెప్టెంబర్ 26న వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో 2.25 శాతానికి చేరుకున్నది. 2015 నుంచి ఇలా వడ్డీరేట్లను పెంచడం ఇది ఎనిమిదోసారి. 2008 ఆర్థిక సంక్షోభం వచ్చిన నాటినుంచి వడ్డీరేట్లు 0.25 శాతంగా ఉన్నాయి. ఒకవేళ మరోదఫా వడ్డీరేట్లను పెంచితే పసిడి విక్రయాలపై ప్రభావం చూపనున్నాయి. వచ్చేనెలలో మళ్లీ అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు పెంచే అవకాశాలు లేకపోలేదు.  

స్పాట్ గోల్డ్ ధర అంతర్జాతీయ మార్కెట్లో 1.3 శాతం పతనమై ఔన్స్ 1207.78 డాలర్లుగా నమోదైంది. గత నెల 11వ తేదీన నమోదైన 1206.13 డాలర్ల తర్వాత ఇదే తక్కువ ధర. ఆగస్టు 17వ తేదీతో ముగిసిన వారం ధరతో పోలిస్తే బంగారం ధర రెండు శాతం దిగువన నమోదైంది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 16.5 డాలర్లు తగ్గి 1208.60 డాలర్ల వద్ద స్థిరపడింది. అమెరికా వడ్డీరేట్లు పెరిగితే పసిడిపై పెట్టుబడులు తగ్గిపోతాయని ఆర్జేఓ ప్యూచర్స్ సీనియర్ మార్కెట్ స్ట్రాటర్జిస్ట్ బాబ్ హేబర్ కోర్న్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios