Asianet News TeluguAsianet News Telugu

కస్టమర్లకు షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. రెండేళ్ల గరిష్టానికి పసిడి.. నేడు తులం ధర ఎంతంటే ?

హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో ఈ రోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,950, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,580. 

Gold and silver rates today surges in Hyderabad, Bangalore, Kerala, Visakhapatnam - 04 January 2023
Author
First Published Jan 4, 2023, 10:14 AM IST

నేడు దేశీయంగా చూస్తే పసిడి, వెండి ధరలు ఏకంగా రెండేళ్ల గరిష్టాన్ని తాకాయి దీంతో 2020 ఆగస్టు నాటికి ధరలు చేరాయి. నేడు 04 జనవరి 2023న ఈరోజు ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబైలలో బంగారం ధరలు తగ్గాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,110, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.55,740 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,950,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,670. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,950, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,580. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,950, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 55,580. వెండి ధరలు 1 కేజీకి కోల్‌కతా, చెన్నై, ముంబైలలో రూ. 72,000.

మరోవైపు హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో ఈ రోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,950, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,580. హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 50,950. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 540 పెంపుతో 55,580. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,950, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,580. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,580. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 75,500.

గత సెషన్‌లో ఆరు నెలల గరిష్ట స్థాయిని తాకిన తర్వాత, 0023 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $1,838.69 వద్ద స్థిరపడింది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1% తగ్గి $1,843.60కి చేరుకుంది. స్పాట్ సిల్వర్ 0.2% పెరిగి $24.03 డాలర్లకి, ప్లాటినం 0.4% తగ్గి $1,079.71డాలర్లకి, పల్లాడియం 1% పెరిగి $1,726.59డాలర్లకి చేరుకుంది.

 డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.813 వద్ద కొనసాగుతోంది. భారత రూపాయి బలహీనపడటం, రష్యా-ఉక్రెయిన్ వివాదం మరింత పెరుగుతుందనే భయాల కారణంగా ఈ పెరుగుదల ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రతరం అవుతుందన్న భయంతో బంగారం ధరలు ఔన్సుకు 1837 డాలర్ల మార్కును దాటుతున్నాయని ఆల్-ఇండియా జెమ్స్ & జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ మాజీ డైరెక్టర్ అవినాష్ గుప్తా అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios