సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి.. రికార్డు స్థాయికి బంగారం ధర.. సంక్రాంతికి ఎంత పెరగవచ్చంటే ?
హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలలో ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, మరోవైపు వెండి ధరలు కూడా మారలేదు. తాజా కాలంలో బంగారం ధరలు అస్థిరంగా ఉండడం, భారత రూపాయి బలహీనపడడమే ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

పసిడి ప్రియులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. శుభకార్యాలు, పండుగల సమయాల్లో బంగారం కొనేందుకు మహిళలు ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు. కొత్త ఏడాది నుండి బంగారం, వెండి ధర ఒకసారి పడిపోతు మరోసారు పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు పసిడి అల్ టైమ్ హై రికార్డు ధరకు చేరువైంది.
నేడు 09 జనవరి 2023న ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబైలలో బంగారం ధరలు పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,450, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,110 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,210, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,960. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,960. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,960.
ఈ రోజు వెండి ధరలు చూస్తే కోల్‌కతా, ముంబైలలో కేజీ ధర రూ. 71,800, చెన్నైలో కేజీ వెండి ధర రూ. 74,400.
హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలలో ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, మరోవైపు వెండి ధరలు కూడా మారలేదు. తాజా కాలంలో బంగారం ధరలు అస్థిరంగా ఉండడం, భారత రూపాయి బలహీనపడడమే ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, తాజా ధరల ప్రకారం బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,960.
ఈ రోజు హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,960. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,960. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,300, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,960. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 74,400గా ఉంది.
0016 GMT నాటికి స్పాట్ బంగారం 0.2% పెరిగి ఔన్సుకు $1,868.89 డాలర్ల వద్ద ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.2% పెరిగి $1,873.80 డాలర్ల వద్ద ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ 0.2% తగ్గింది, దీంతో విదేశీ కొనుగోలుదారులకు బంగారం చౌకగా మారింది. స్పాట్ వెండి 0.6% పెరిగి $23.95 డాలర్లకి చేరుకోగా, ప్లాటినం 0.5% పెరిగి $1,094.97డాలర్లకి, పల్లాడియం 0.1% తగ్గి $1,804.30డాలర్లకి చేరుకుంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు వర్తిస్తాయి అలాగే ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు అనేక ఇతర కారణాలు బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణం అని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇంకా చాలా అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.