బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలో సోమవారం (జనవరి 31, 2022) మార్పు కన్పించింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలో సోమవారం (జనవరి 31, 2022) మార్పు కన్పించింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులకు చాలా కారణాలు ప్రభావితం చేస్తుంటాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, వివిధ దేశాలపై ఆంక్షలు, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటివి ప్రధానంగా ఉంటాయి. అందుకే బంగారం ధర ప్రతిరోజూ మారుతుంటుంది. గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45,000 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 200గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45,000 కాగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 100 రూపాయలుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45,000 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 090 రూపాయలుగా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45,000 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 140 రూపాయలుంది. ఇక కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45,000 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 100 రూపాయలుగా ఉంది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ. 45,000గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 100గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45,000 కాగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 100 రూపాయలుంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
వెండి ధరలు
ఇక ఢిల్లీలో నేడు కిలో వెండి రూ. 61, 200 కాగా.. ముంబైలో కూడా అదే ధర కొనసాగుతోంది. చెన్నై, కేరళలో కిలో వెండి రూ. 65, 500గా ఉంది. అటు కోల్‌కతాలో కిలో వెండి రూ. 61, 200గా ఉంది. ఇకపోతే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి రూ. 65, 500గా ఉంది.
