బంగారం ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. మొన్నటి వరకూ పెరిగిన బంగారం ధర ఇప్పుడు క్షీణిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నేటి (జ‌న‌వ‌రి 30, 2022) బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 

బంగారం ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. మొన్నటి వరకూ పెరిగిన బంగారం ధర ఇప్పుడు క్షీణిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నేటి (జ‌న‌వ‌రి 30, 2022) బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం, వెండి రెండింటి ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, డాలర్ విలువ, కరోనా మహమ్మారి, వివిధ దేశాల మధ్య పరిణామాలు అన్నీ బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే బంగారం ధర రోజురోజుకీ మారుతుంటోంది. గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర మొన్నటి నుంచి తగ్గుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో నేటి బంగారం, వెండి ధర‌లు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45,000, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 100 రూపాయలుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45,000 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49,100 రూపాయలుగా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45,000 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49,000గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45,000 రూపాయలుంటే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49,000గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45,000 కాగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 100 రూపాయలుంది. 

ఇక హైదరాబాద్‌లో (Hyderabad Gold Price) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45,000 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 100 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 45,000 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49, 150 రూపాయలుగా ఉంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 

వెండి ధరలు
ఇక వెండి ధరలు (Silver Price) ఈవిధంగా ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో కిలో వెండి రూ. 61,100 రూపాయలు కాగా, కేరళలో కిలో వెండి రూ. 63,300 రూపాయలుంది. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం న‌గ‌రాల్లో కిలో వెండి రూ. 65,500గా ఉంది.