Asianet News TeluguAsianet News Telugu

Gold and Silver Rates Today: పెరిగిన ధ‌ర‌లు.. నేటి బంగారం, వెండి ధ‌ర‌లివే..!

దేశంలో బంగారం ధరలు నిన్న‌టి పోలిస్తే బుధ‌వారం (జ‌న‌వ‌రి 26, 2022) పెరిగాయి. ఇక అటు వెండి ధర 800 రూపాయిలు పడిపోయింది. మార్కెట్‌లో బుధవారం నాటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 
 

Gold and Silver Rates Today
Author
Hyderabad, First Published Jan 26, 2022, 10:25 AM IST

దేశంలో బంగారం ధరలు నిన్న‌టి పోలిస్తే బుధ‌వారం (జ‌న‌వ‌రి 26, 2022) పెరిగాయి. ఇక అటు వెండి ధర 800 రూపాయిలు పడిపోయింది. మార్కెట్‌లో బుధవారం నాటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 

బంగారం ధర మార్కెట్‌లో ఎప్పటికప్పుడు మారుతుంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం వంటి కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. దేశీయంగా పరిశీలిస్తే బుధ‌వారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,750గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 49,910 రూపాయలుగా ఉంది.  ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Gold Price Today) ఎలా ఉన్నాయో  చూద్దాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,000 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,910గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,680గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,500 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,910గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 45,750 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 49,910 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 45,750గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49,910 రూపాయలుగా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధ‌ర కొన‌సాగుతోంది.

వెండి ధ‌ర‌లు

మంగళవారం (జనవరి 25)న దేశంలో వెండి ధర దిగి వచ్చింది. దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో కిలో వెండి ధర స్వల్పంగా దిగి వచ్చింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 64,100లుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 64,100లుగా కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 64,100లుగా ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర 64,100 లుగా ఉంది. కేరళలో కిలో వెండి ధర 68,200 లుగా కొనసాగుతోంది. కాగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 68,200గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 68,200గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధ‌ర కొన‌సాగుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios