డాలర్ స్వల్పంగా పుంజుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు అస్థిరంగా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.2% పడిపోయి $1,783.50కి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2% తగ్గి $1,795.10కి చేరాయి.

నేడు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 30 లేదా 0.06% తగ్గి రూ.53,957 వద్ద ట్రేడవుతున్నాయి. ఎంసీఎక్స్‌లో సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.180 తగ్గి రూ.66,087 వద్ద ట్రేడవుతోంది.

డాలర్ స్వల్పంగా పుంజుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు అస్థిరంగా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.2% పడిపోయి $1,783.50కి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2% తగ్గి $1,795.10కి చేరాయి.

ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు ఆల్ టైమ్ హై కంటే తక్కువ ధరకు లభిస్తోంది. ఆగస్ట్ 2020లో బంగారం ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో పది గ్రాములు పసిడి ధర రూ.56200 స్థాయికి పెరిగింది.

బులియన్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల పెరుగుదల దశ కొనసాగుతుంది. అలాగే త్వరలో కొత్త సంవత్సరం 2023లో బంగారం ధర గరిష్ట స్థాయికి సమీపంలో లేదా అంతకంటే ఎక్కువ చేరుకుంటుంది అని అన్నారు.

బంగారం స్వచ్ఛతను తెలుసుకొవడం ఎలా
మీరు బంగారం స్వచ్ఛతను చెక్ చేయాలనుకుంటే దీని కోసం ప్రభుత్వం ఒక యాప్‌ను రూపొందించింది. BIS కేర్ యాప్‌తో, కస్టమర్లు బంగారం స్వచ్ఛతను చెక్ చేయవచ్చు. ఈ యాప్ ద్వారా బంగారం స్వచ్ఛతను చెక్ చేయడమే కాకుండా దానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదునైనా చేయవచ్చు.

ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా అండ్ ముంబైలలో ఈ రోజు బంగారం ధరలు కాస్త పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,650, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,150 వద్ద ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,160గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,720. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,000. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,500, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.54,000. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,500, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,000.

వెండి ధరలు చూస్తే కోల్‌కతా, ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ.66,200గా ఉంది. హైదరాబాద్, చెన్నై లో కిలో వెండి ధర రూ.71,000.