Asianet News TeluguAsianet News Telugu

Gold and Silver Rates Today: పెరిగిన ధ‌ర‌లు.. 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే..?

దేశంలో పసిడి ధరలు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. గురువారం (జనవరి 27)న దేశంలో బంగారం ధర (Today Gold Price) మళ్లీ పెరిగింది. బంగారం ధర మార్కెట్‌లో ఎప్పటికప్పుడు మారుతుంటుంది. 

Gold and Silver Rates Today:
Author
Hyderabad, First Published Jan 27, 2022, 10:44 AM IST

దేశంలో పసిడి ధరలు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. గురువారం (జనవరి 27)న దేశంలో బంగారం ధర (Today Gold Price) మళ్లీ పెరిగింది. బంగారం ధర మార్కెట్‌లో ఎప్పటికప్పుడు మారుతుంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం వంటి కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Gold Price Today) ఎలా ఉన్నాయో  చూద్దాం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,830గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,910 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధ‌ర కొన‌సాగుతోంది.

వెండి ధ‌ర‌లు

గురువారం (జనవరి 27) వెండి ధర స్వ‌ల్పంగా పెరిగింది.  దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో కిలో వెండి ధర స్వల్పంగా పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 64,200లుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 64,200లుగా కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 68,500లుగా ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 64,200 లుగా ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ. 68,500లుగా కొనసాగుతోంది. ఇక‌పోతే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 68,500గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 68,500లుగా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధ‌ర కొనసాగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios