Asianet News TeluguAsianet News Telugu

ఆగనంటున్న బంగారం ధరల పరుగు.. నేడు 10గ్రాములకు ఎంతంటే ?

పసిడి ధర ఎంత మాత్రం ఆగనంటున్నది. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులకు తోడు పశ్చిమ దేశాల్లోని మదుపర్లు తమ పెట్టుబడులకు ప్రత్యామ్నాయ మార్గంగా పసిడి నిలవడమే దీనికి కారణం. పుత్తడితోపాటు వెండి ధర కూడా పెరుగుతోంది.

Gold and Silver prices today surges in Hyderabad, Bangalore, Kerala, Visakhapatnam, 10 July 2020
Author
Hyderabad, First Published Jul 10, 2020, 10:36 AM IST

న్యూఢిల్లీ: పసిడి అంటే మహిళలకు ఎంతో ప్రీతి.. కానీ కరోనా కల్లోలంతో పుత్తడి వారికి అందనంటూ దూసుకు వెళ్తోంది. దీంతో బంగారం ధర సరికొత్త జీవిత కాల గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. 

గురువారం హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.470 పెరిగి రూ.51,460కి ఎగబాకింది. పసిడితోపాటు వెండి కూడా పుంజుకుంది. 

కిలో వెండి ధర ఏకంగా రూ.1,880 పెరగడంతో రూ.51,900కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధర ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం 1,800 డాలర్లు, వెండి 18 డాలర్లకు ఎగువన ట్రేడ్ అవుతున్నాయి.

ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.50,184, కిలో వెండి రూ.52,930 పలికింది. ఇక ముంబై బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర రూ.49,239, కిలో వెండి రూ.51,220గా నమోదైంది. 

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆర్థిక ప్రగతిపై అనిశ్చితి కమ్ముకున్నది. దీంతో ధరలు పెరిగిపోవడంతో జ్యూవెల్లరీ దుకాణాలకు వెళ్లి బంగారం కొనేవాళ్లే కరువైనా ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. 

చైనా, భారత్ వంటి సంప్రదాయ రిటైల్ కొనుగోలుదారుల నుంచి మాత్రం ఫిజికల్‌‌‌‌గా బంగారానికి డిమాండ్ పడిపోయింది. గోల్డ్ బార్లు, కాయిన్లు, జ్యూవెల్లరీ ప్రపంచంలోనే అతి ఎక్కువగా కొనుగోలు చేసేది ఈ రెండు దేశాల ప్రజలే. దీంతో బంగారం దిగుమతులు తగ్గిపోగా, విక్రయాలు‌‌‌ పడిపోయాయి. 

రెండు కారణాలపైనే గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు ప్రధానంగా ఆధార పడుతున్నాయి. ఒకటి వెస్ట్రన్ ఇన్వెస్టర్లు సురక్షితమైన సాధనంగా గోల్డ్‌‌‌‌ను పరిగణించడమైతే, రెండోది ఆసియా దేశాలలో ఫిజికల్ గోల్డ్ కొనుగోళ్లు. ఒకవేళ గ్లోబల్‌‌‌‌గా ఈటీఎఫ్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్లోలు తగ్గితే గోల్డ్ ధరలకు ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు.

ఆసియా‌‌తో పోలిస్తే అమెరికా, యూరోపియన్ ఇన్వెస్టర్ల నుంచే గోల్డ్‌‌‌‌కు ఎక్కువగా డిమాండ్ వస్తుందని భావిస్తున్నామని డబ్ల్యూఎస్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ మేనేజ్‌‌‌‌మెంట్ అమెరికా పోర్ట్‌‌‌‌ఫోలియో మేనేజర్, కమోడిటీస్ హెడ్ డార్వే కుంగ్ అన్నారు. 

also read యస్‌ బ్యాంకు కుంభకోణంలో రాణా కపూర్‌కు షాక్‌.. వేల కోట్ల ఆస్తులు జప్తు.. ...

అభివృద్ధి చెందిన దేశాల్లో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా గోల్డ్‌‌‌‌ను ఎంపిక చేసుకోవడంతో ఈ ఏడాది గోల్డ్ ధరలు 18 శాతం మేర పెరిగాయని గోల్డ్‌‌‌‌మ్యాన్ శాక్స్ గ్రూప్ పేర్కొంది. ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో ఎకనమిక్ రికవరీ, డాలర్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ తగ్గడం వంటివి గోల్డ్ ధరలు తగ్గడానికి బదులు మరింత పెరిగేలా చేస్తాయని చెప్పింది.

2020లో స్పాట్ గోల్డ్ ధరలు 17 శాతం పెరిగాయి. ఈ నాలుగేళ్లలో ఈ రెండో క్వార్టర్‌‌‌‌‌‌‌‌లోనే అత్యధికంగా ర్యాలీ చేశాయి. 2011 నుంచి ఈ మేర పెరగడం ఇదే తొలిసారి. బంగారం ధరల పెరుగుదల ఆసియా మార్కెట్‌‌‌‌లోని వారిని నిరుత్సాహపరుస్తోంది. 

ఒకవేళ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ప్రభావం ఆసియన్ షాపర్లపై బాగానే ఉంటుంది. 2020లో చైనా గోల్డ్ జ్యూవెల్లరీ వినియోగం 23% తగ్గుతుందని మెటల్స్ ఫోకస్ లిమిటెడ్ అంచనావేసింది. అదేవిధంగా ఇండియాలో 36 శాతం మేర డిమాండ్ పడుతుందని తెలిపింది. 

చైనాలో గోల్డ్ సేల్స్ 2019 కంటే 30 శాతం తక్కువకు పడిపోయాయని  చైనా గోల్డ్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాంగ్ యాంగ్‌‌‌‌టావో చెప్పారు. కరోనా వైరస్‌‌‌‌ అవుట్‌‌‌‌బ్రేక్‌‌‌‌తో 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉందన్నారు.

మరోవైపు, సురక్షితమైన గోల్డ్ లోన్లపై ఫెడరల్ బ్యాంకులు ఫోకస్ చేశాయి. గోల్డ్ ధరలు పెరుగుతున్న ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో పసిడిని తనాఖా పెట్టుకుని, బ్యాంక్‌‌లు రుణాలిస్తున్నాయి.

ఇతర క్రెడిట్ ఆప్షన్లు తగ్గుతున్న ప్రస్తుత సమయంలో, గోల్డ్ లోన్ల సెగ్మెంట్‌‌ బాగా పెరుగుతున్నది. దీని కోసం  రూ.12 వేల కోట్ల క్యాపిటల్‌‌ సేకరించేందుకు బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపినట్టు ఎండీ, సీఈవో శ్యామ్ శ్రీనివాసన్ చెప్పారు. 

గత ఆర్థిక సంవత్సరం 29 శాతం గ్రోత్‌‌ నమోదు చేసిన బ్యాంక్ గోల్డ్‌‌ లోన్ సెగ్మెంట్ ఈ ఏడాది 35 శాతం గ్రోత్‌‌పై ఫోకస్ చేసింది. బ్యాంక్ గోల్డ్ లోన్ బుక్, మొత్తం లోన్ బుక్‌‌లో 8 శాతంతో రూ.9,600 కోట్లుగా ఉంది. ఈ ఏడాది 15 శాతం బంగారం రుణాలు పెరుగుతాయని శ్రీనివాసన్ పేర్కొన్నారు. కేవలం జూన్ క్వార్టర్‌‌‌‌లోనే గోల్డ్ లోన్ గ్రోత్ 5 శాతంగా ఉండనుందని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios