రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పసిడి ధరలు ఇటీవల ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 సమీపానికి చేరుకున్నాయి. గత నెలలో రూ.55,500ను సమీపించాయి. అయితే యుద్ధ ఉద్రిక్తతలు తగ్గడంతో మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఉక్రెయిన్ నుండి రష్యా తన బలగాలను ఉపసంహరించే దిశగా అడుగులు వేస్తే పసిడి 1900 డాలర్ల దిగువకు పడిపోవచ్చునని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

బంగారం, వెండి ధ‌ర‌లు ఆదివారం దిగివ‌చ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో (ఏప్రిల్ 03, 2022) ఆదివారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.47,950 వ‌ద్ద ఉంది. మ‌రోవైపు బంగారం ధరలు క్షీణించ‌డంతో వెండి ధర కూడా భారీగా తగ్గింది. దేశీయంగా కిలో వెండిపై రూ.400 తగ్గుముఖం పట్టింది. దీంతో కేజీ వెండి ధ‌ర‌ రూ.71,300కు చేరింది. సాధారణంగా అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, డాలర్ విలువ బంగారంపై ప్రభావం చూపిస్తుంటాయనేది తెలిసిందే. అదే సమయంలో రెండు దేశాల మధ్య భౌతిక పరిస్థితులు బంగారం, వెండితో సహా అన్ని ఇతర అంశాలపై పెను ప్రభావం చూపిస్తుంటుంది. 

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,480గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,200 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,580గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.52,480 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి రూ.48,100 నుంచి రూ.47,950కు పడిపోయింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గింది. దీంతో ఈ ధర రూ.52,470 నుంచి రూ.52,310కు దిగొచ్చింది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,310 వ‌ద్ద ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.

వెండి ధరలు

మ‌రోవైపు వెండి ధర తగ్గింది. దేశీయంగా రూ.400 తగ్గుముఖం పట్టింది. తాజాగా ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా, ముంబైలో కిలో వెండి ధ‌ర‌ రూ.66,800గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా, కోల్‌కతాలో రూ.66,800గా ఉంది. బెంగళూరులో కిలో బంగారం ధర రూ.71,300 ఉండగా, కేరళలో రూ.71,300గా ఉంది. ఇక‌పోతే.. హైదరాబాద్‌లో కిలో బంగారం ధర రూ.71,300 ఉండగా, విజయవాడలో రూ.71,300 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర ఉంది.