బంగారం, వెండి ధరలు మ‌రోసారి పెరిగాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో గత కొద్దిరోజలుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 

పసిడి రేటు పరుగులు పెడుతోంది. బంగారం ధర దూసుకుపోతోంది. నిన్న దిగి వచ్చిన బంగారం ధర శుక్ర‌వారం (మార్చి 25, 2022) మాత్రం పైపైకి కదిలింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బంగారం ధర పైపైకి చేరితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధ‌ర భారీగా పెరిగింది. దీంతో బంగారం, వెండి కొనాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడనుందని చెప్పుకోవచ్చు.

హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పెరిగింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 640 దూసుకుపోయింది. దీంతో ఇప్పుడు పసిడి రేటు రూ. 52,310కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. పసిడి రేటు రూ.600 పెరుగుదలతో రూ. 47,950కు ఎగసింది. బంగారం ధరలు దూసుకుపోతే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. రూ.900 పరుగులు పెట్టింది. దీంతో వెండి ధ‌ర‌ రూ. 72,800కు చేరింది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,310గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,310గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,950 ఉండ‌గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,310గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,950గా ఉంది. అటు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,310గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 48,310 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,700గా ఉంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,950 రూపాయలుంటే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 52,310గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 47,950 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 52,310గా ఉంది.

వెండి ధరలు

ఇక బంగారం లాగే వెండి కూడా పెరిగింది. దేశీయంగా కిలో వెండిపై రూ. 900లకుపైగా పెరిగింది. చెన్నైలో కిలో వెండి ధర రూ.72,800 ఉండగా, ముంబైలో రూ.68,500గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,500 ఉండగా, కోల్‌కతాలో రూ.68,500గా ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,800 ఉండగా, కేరళలో రూ.72,800 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో రూ.72,800గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.72,800 ఉండగా, విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధ‌ర కొన‌సాగుతోంది.