బంగారం ధర స్థిరంగానే కొనసాగుతోంది. నిన్న దిగివచ్చిన బంగారం ధర సోమ‌వారం మాత్రం నిలకడగానే ఉంది. బంగారం ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధ‌ర‌లో కూడా మార్పు లేదు.  

ఉక్రెయిన్‌, రష్యాల మధ్య యుద్ధ కారణంగా బంగారం ధరలు ఆల్‌టైమ్‌ హైకి చేరుకుంది. ఓ సమయంలో 10 గ్రాముల పసిడి ధర రూ. 53 వేలకు పైగా వెళ్లింది. అయితే గతవారం రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. శనివారం బంగారం ధర స్వల్పంగా పెరగగా.. ఆదివారం తగ్గింది. ఇక సోమవారం (మార్చి 21, 2022) పసిడి ధరలు నిలకడగా ఉన్నాయి.

సోమ‌వారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారం, 24 క్యారెట్ల ధర నిలకడగా ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.68,000గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో నేటి బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా ఉంది. ఆర్థిక రాజ‌ధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,050గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,420 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా ఉంది.

తెలుగు రాష్ట్రాలైన.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,300 ఉండ‌గా.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,600 వద్ద కొనసాగుతోంది. 

వెండి ధ‌ర‌లు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,000గా ఉంది. ఆర్థిక రాజ‌ధాని ముంబైలో కిలో వెండి ధర రూ.68,000 ఉండగా.. చెన్నైలో కిలో వెండి ధర రూ.72,300గా ఉంది. బెంగళూరులో రూ.72,300 ఉండ‌గా.. కేరళలో రూ.72,300గా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,300 ఉండ‌గా, విజయవాడలో రూ.72,300 కాగా.. విశాఖపట్నంలో రూ.72,300గా కొనసాగుతోంది.