బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి శుభవార్త. పసిడి రేటు పడిపోయింది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరకు బ్రేకులు పడ్డాయి.
గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్-రష్యా యుద్ధాల కారణంగా పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగవు. ప్రస్తుతం దేశంలో బంగారం, వెండి ధరలు ధరలు తగ్గుతున్నాయి. తాజాగా గురువారం (మార్చి 17, 2022)న దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.300, 24 క్యారెట్లపై రూ.330 మేర తగ్గింది. మరోవైపు వెండి ధరలు కూడా రూ.2,000 మేర తగ్గాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.67,900గా ఉంది.
అంతర్జాతీయంగా బంగారం, వెండి డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం డిమాండ్, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, డాలర్ విలువ వంటివి ప్రభావం చూపిస్తుండటం వల్ల బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,920గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,280 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా ఉంది.
ఇకపోతే తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,300.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,600 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు
వెండి ధర భారీగా తగ్గింది. నిన్నటితో పోల్చితే ఏకంగా రూ. 2000 తగ్గింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,900గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా.. చెన్నైలో కిలో వెండి ధర రూ.72,300గా ఉంది. బెంగళూరులో రూ.72,300, కేరళలో రూ.72,300లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,300లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ.72,300లుగా కొనసాగుతోంది.
