బంగారం ధర మరోసారి ఆకాశాన్ని తాకుతోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, స్టాక్ మార్కెట్ ఒడుదుడుకుల నేపథ్యంలో బంగారం ధరలు పెరిగిపోయాయి.

బంగారం ధర మన దేశంలో మ‌రోసారి పెరిగింది. దేశంలోని పలు నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 52,000 వేల‌కు పైగా చేరుకుంది. ఇక గడిచిన రెండు రోజులుగా శాంతించిన బంగారం ధర ఆదివారం మరోసారి ఎగబాకింది. ఆదివారం దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా ఆదివారం (మార్చి 13, 2022) బంగారం ధ‌ర‌లు ఈ విధంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా బంగారం, వెండి డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం డిమాండ్, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, డాలర్ విలువ వంటివి ప్రభావం చూపిస్తుండటం వల్ల బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ముఖ్యంగా పసిడి ధర రోజురోజుకూ పరుగెడుతోంది. 

దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర‌ రూ. 48,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,800 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ. 48,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ. 52,800గా ఉంది. చెన్నైలో మాత్రం బంగారం ధర తగ్గింది. 22 క్యారెట్ల బంగారంపై రూ. 120 తగ్గి రూ. 48,940 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ. 130 తగ్గి రూ. 53,390 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 48,400 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ. 52,800 వద్ద నమోదైంది.

తెలుగు రాష్ట్రాలైన‌.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 48,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ. 52,800 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ. 48,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,800గా ఉంది. ఇక విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధ‌ర కొన‌సాగుతోంది.

వెండి ధ‌ర‌లు
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం కిలో వెండిపై రూ. 100 పెరిగి రూ. 70,300 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండిపై రూ. 100 పెరిగి రూ. 70,300గా ఉంది. చెన్నైలో కిలో వెండిపై రూ. 100 పెరిగి రూ. 74,700 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కూడా కిలో వెండి ధర రూ. 100 పెరిగి, రూ. 74,700గా ఉంది.

తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్‌లో కూడా వెండి ధరలో పెరుగుదల కనిపించింది. కిలో వెండిపై రూ. 100 పెరిగి, రూ. 74,700 వద్ద కొనసాగుతోంది. విజ‌య‌వాడలో కిలో వెండి రూ. 74,700గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధ‌ర‌ కొనసాగుతోంది.