నిన్న పరుగులు పెట్టిన బంగారం ధర నేడు (ఫిబ్రవరి 17, 2022) మళ్లీ నేలచూపులు చూసింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.
న్న పరుగులు పెట్టిన బంగారం ధర నేడు (ఫిబ్రవరి 17, 2022) మళ్లీ నేలచూపులు చూసింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర కూడా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరగుతూ ఉన్నా దేశీ మార్కెట్‌లో పసిడి నేలచూపులు చూడటం గమనార్హం. తెలుగు రాష్ట్రాలతోపాటు.. ఇతర ముఖ్య నగరాల్లోనూ బంగారం, వెండి ధరలలో మార్పులు వచ్చాయి.
దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,190కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,390కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 46,190 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,390కు చేరింది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,630కు చేరుకోగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.50,830కు చేరింది. ఇక బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,190 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 50,390కు చేరింది.
ఇకపోతే.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 190కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 50,390కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 190కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,390కు చేరింది.
వెండి ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 63,400కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 63,400కు చేరింది. వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 63,400కు చేరింది. అలాగే చెన్నై, బెంగుళూరులో కిలో వెండి రూ. 67,900 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 67,900 దగ్గర కొనసాగుతుంది. హైదరాబాద్ లో పది గ్రాముల వెండి ధర రూ. 679 వద్ద కొనసాగుతుంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ. 67,900 వద్ద ఉండగా.. పది గ్రాముల వెండి ధర రూ. 679గా ఉంది.
