Asianet News TeluguAsianet News Telugu

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో.. బంగారం ధర కూడా తగ్గినట్లు బులియన్ ట్రేడ్ వర్గాలు తెలిపాయి.  డిమాండ్ లేని కారణంగా పుత్తడి ధర రూ.32వేలకు దిగువకు చేరింది. 

gold and silver prices: Gold slips Rs 210 on sluggish demand
Author
Hyderabad, First Published Dec 19, 2018, 4:29 PM IST

బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో.. బంగారం ధర కూడా తగ్గినట్లు బులియన్ ట్రేడ్ వర్గాలు తెలిపాయి.  డిమాండ్ లేని కారణంగా పుత్తడి ధర రూ.32వేలకు దిగువకు చేరింది. పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో  తయారీదారుల దగ్గర నుంచి కొనుగోళ్లు మందగించాయి.

దీనికి తోడు అంతర్జాతీయ పరిణామాలు పసిడి ధరపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నాటి ట్రేడింగ్ లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. రూ.210తగ్గి.. పది గ్రాముల బంగారం ధర రూ.31,850కి చేరింది.

నేటి మార్కెట్లో బంగారంతోపాటు వెండి కూడా తగ్గింది. రూ.435 తగ్గి.. కిలో వెండి ధర రూ.37,880కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో.. వెండి ధర తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 0.06 శాతం తగ్గి ఔన్సు బంగారం ధర 1250.80డాలర్లకు చేరింది. 

Follow Us:
Download App:
  • android
  • ios