Asianet News TeluguAsianet News Telugu

Gold And Silver Price Today: ఆదివారం షాకిస్తున్న ప‌సిడి ధ‌ర‌లు.. తగ్గిన‌ వెండి..!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. మరోవైపు వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,550 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారంపై 110 రూపాయలు పెరిగింది. దీంతో ఆ బంగారం ధర రూ.51,870కి పెరిగింది. హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.65,700 అయింది.
 

Gold And Silver Price Today
Author
Hyderabad, First Published Jun 26, 2022, 8:03 AM IST

బంగారం ధర ఆదివారం మళ్లీ షాకిచ్చింది. ఆదివారం బులియన్ మార్కెట్లలో బంగారం ధర పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.47,550కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగి రూ.51,870కి చేరింది. బంగారం మెరిసిన ఈ సమయంలో.. వెండి వెలవెలబోయింది. కేజీ వెండి ధరపై రూ.300 తగ్గడంతో కిలో రేటు రూ.65,700గా న‌మోదైంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆదివారం (జూన్ 26, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..! 

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,870గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,600 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,920గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.51,870 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,550 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,870గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,550 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,870గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 59,800 ఉండగా, ముంబైలో రూ.59,800గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.65,700 ఉండగా, కోల్‌కతాలో రూ.59,800గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.65,700 ఉండగా, కేరళలో రూ.65,700గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,700 ఉండగా, విజయవాడలో రూ.65,700 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios