Asianet News TeluguAsianet News Telugu

బంగారం, వెండి ధరలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్.. నేడు 10గ్రా., ధర ఎంత పెరిగిందంటే ?

అంతర్జాతీయ మార్కెట్‌లో డిసెంబర్ 10న బంగారం ధరలు కాస్త పెరిగాయి. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ 10న 09:25 గంటల సమయానికి 10 గ్రాముల గోల్డ్ కాంట్రాక్టులు 0.13 శాతం పెరిగి రూ. 48,000కి చేరుకున్నాయి. 
 

Gold And Silver Price Today: Due to the fear of Omicron price of gold has increased
Author
Hyderabad, First Published Dec 10, 2021, 1:13 PM IST

యూ‌కేతో సహా ప్రపంచంలోని దాదాపు 12 దేశాల్లో కోవిడ్-19 ఓమిక్రాన్ వేరియంట్ భయాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు డాలర్ ఇండెక్స్ పతనం కారణంగా శుక్రవారం బంగారం, వెండి ధరల్లో క్షీణత కనిపిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం భారతదేశంలో బంగారం ధర పది గ్రాములకు రూ. 48700 స్థాయిని అధిగమించినట్లయితే డిసెంబర్ నెలలో బంగారం ధర 50 వేల స్థాయిని తాకవచ్చు అని సూచించారు. మరోవైపు, విదేశీ మార్కెట్లలో బంగారం ధర 1820 డాలర్ల స్థాయిని అధిగమించినట్లయితే బంగారం 1880 డాలర్ల స్థాయిని దాటుతుందని తెలిపారు. 

భారత్‌లో బంగారం ధర శుక్రవారం దాదాపు రూ.48,000 మార్కుకు చేరుకుంది. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ 10న 09:25 గంటల సమయానికి 10 గ్రాముల గోల్డ్ కాంట్రాక్టులు 0.13 శాతం పెరిగి రూ. 48,000కి చేరుకున్నాయి. అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరించి శుక్రవారం వెండి స్థిరంగా ఉంది. 100 గ్రాముల విలువైన సిల్వర్ ఫ్యూచర్ 0.05 శాతం తగ్గి రూ.60,768కి చేరుకుంది.

ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం బంగారం ధర కాస్త పెరిగింది. ఒక నివేదిక ప్రకారం, 0057 GMT నాటికి స్పాట్ బంగారం 0.1 శాతం పెరిగి 1,776.23డాలర్లకి చేరుకుంది. అయినప్పటికీ యూ‌ఎస్ ద్రవ్యోల్బణం డేటాకు ముందు పెట్టుబడిదారులు పక్కదారి పట్టడంతో పసుపు లోహం వరుసగా నాలుగో వారం పతనానికి సిద్ధంగా ఉంది. US ద్రవ్యోల్బణం గణాంకాలు డిసెంబర్ 10న అంటే నేడు వెల్లడికానున్నాయి. వారంలో ఇప్పటివరకు బులియన్ ధరలు 0.4 శాతం క్షీణించాయి.  

విదేశీ మార్కెట్లలో బంగారం, వెండి
 న్యూయార్క్  Comex మార్కెట్ గురించి మాట్లాడితే బంగారం ధర స్వల్ప పెరుగుదలతో ఔన్సుకు  1780 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ఔన్స్‌కు 22 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు, లండన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఒకటిన్నర పౌండ్లు పెరిగి 1344.34 పౌండ్లకు, వెండి ఔన్స్‌కు 16.65 పౌండ్లకు చేరుకుంది. యూరోపియన్ మార్కెట్ల గురించి మాట్లాడితే బంగారం ఔన్స్‌కు 2.13 యూరోల పెరుగుదలతో 1574.22 యూరోల వద్ద ట్రేడవుతోంది. వెండి ఔన్స్‌కు 19.49 యూరోల వద్ద ట్రేడవుతోంది.

భారతదేశంలో బంగారం ధర 
భారతదేశ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఇండెక్స్ బంగారం ధరలలో పెరుగుదలను చూస్తోంది. రాత్రి 9.25 గంటల సమయానికి రూ.52 లాభంతో పది గ్రాముల బంగారం ధర రూ.47993 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే బంగారం ధర 48 వేల స్థాయిని దాటింది. కాగా, ఈరోజు బంగారం ధర పది గ్రాములకు రూ.47981కి చేరింది. కాగా,  నిన్న పది గ్రాముల బంగారం ధర రూ.47939 వద్ద ముగిసింది.

మరోవైపు, భారతీయ ఫ్యూచర్స్ మార్కెట్ MCXలో వెండి ధరలో స్వల్ప తగ్గుదల ఉంది . రాత్రి 9.25 గంటలకు కిలో వెండి రూ.28 తగ్గి రూ.60770 వద్ద ట్రేడవుతోంది. కాగా ఈరోజు వెండి కిలో ధర రూ.60763తో రోజు కనిష్ట స్థాయికి చేరుకుంది.  

నిపుణులు చెప్పినదాని ప్రకారం, 
ఒమిక్రాన్ (omicron)విషయంలో ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కఠినత పెరిగిందని IIFL వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీ & కరెన్సీ) అనూజ్ గుప్తా తెలిపారు. ఐరోపాలోని చాలా పెద్ద దేశాలకు లండన్ నుండి హెచ్చరిక కూడా ఉంది. దీనితో పాటు డాలర్ ఇండెక్స్ పతనం కూడా కనిపిస్తోంది. దీని ప్రభావం బంగారం ధరపై చూపిస్తోంది. ప్రస్తుతం బంగారం ధర 1800 డాలర్ల కంటే తక్కువగా ఉందని, అలాగే 1820 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నామని, 1820 డాలర్ల స్థాయిని కూడా బ్రేక్ చేస్తే 1880 డాలర్ల స్థాయిని తాకవచ్చని అంచనా వేస్తున్నట్లు  తెలిపారు. దీంతో భారత్‌లో బంగారం ధర 50 వేల స్థాయిని తాకవచ్చు అని సూచించారు.

బంగారం ధర రికార్డు స్థాయిలో పతనం
గతేడాది ఆగస్టు నెలలో బంగారం ధర ఆల్ టైమ్ హై రేటుకు చేరుకుంది. ఆగస్టు, 2020లో బులియన్ మార్కెట్‌లో బంగారం ధర పది గ్రాములకు రూ.55,400గా ఉంది.ఈ రికార్డు ధరతో గురువారం నాటి బంగారం ధరను పోల్చి చూస్తే, బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.8,000 తగ్గింది.

Follow Us:
Download App:
  • android
  • ios