Asianet News TeluguAsianet News Telugu

'గోద్రెజ్ లాక్' పగిలి చోరికి గురైతే ఎం‌ఆర్‌పిపై 20 రేట్లు ఫ్రీ ఇన్సూరన్స్.. అయితే ఈ నిబంధనలు తెలుసుకోండి..

ప్రజల నడుమ హోమ్‌ సేప్టీ అవగాహన సృష్టించే లక్ష్యంతో గోద్రేజ్‌ లాక్స్‌ ప్రారంభించి హోమ్‌సేప్టీ డే 5వ వార్షికోత్సవంను 15 నవంబర్‌ 2021న నిర్వహించారు. గోద్రేజ్ లాక్స్  ఇప్పుడు లిబర్టీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌తో భాగస్వామ్యం చేసుకుని తమ వినియోగదారులకు మెరుగైన గృహ భద్రతను అందించనుంది

Godrej Locks Offers free burglary insurance up to 20X the value of the product purchased
Author
Hyderabad, First Published Nov 15, 2021, 6:32 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్‌,నవంబర్‌ 15,2021 గోద్రేజ్‌ గ్రూప్‌కు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ గోద్రేజ్‌ అండ్‌ బాయ్‌సీ నేడు తమ వ్యాపార విభాగం గోద్రేజ్‌ లాక్స్‌ నేడు హోమ్‌ సేఫ్టీ డేను నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమ ప్రతీకగా, గోద్రేజ్‌ లాక్స్‌ ఇప్పుడు లిబర్టీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌తో భాగస్వామ్యం చేసుకుని 1280 కోట్ల రూపాయల దోపిడీ భీమాను గోద్రేజ్‌ లాక్స్‌ కొనుగోలుదారులకు అందిస్తుంది.

ఇకపై దొంగలకు భయపడకుండా డబుల్ ప్రొటెక్షన్. కంపెనీ, లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌తో కలిసి, గోద్రెజ్ లాక్ వినియోగదారులకు గొప్ప బీమా కవరేజీని అందిస్తుంది. రూ.1280 కోట్ల వరకు గోద్రెజ్ లాక్‌లను కొనుగోలు చేసే వారి ఆస్తులను కవర్ చేయడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.

ఎవరైతే సుపీరియర్‌ సేఫ్టీ స్ట్రెంత్ గోద్రేజ్‌ లాక్స్‌ అయినటువంటి అడ్వాంటిస్‌ మరియు నూతనంగా విడుదల చేసిన స్పేస్‌ టెక్‌ ప్రో డిజిటల్‌ డోర్‌ లాక్స్‌ కొనుగోలు చేస్తారో వారు ఈ భీమా పొందేందుకు అర్హులు. దేశంలో పూర్తిగా రూపకల్పన చేసి తయారుచేసిన మొట్టమొదటి డిజిటల్‌ లాక్‌ స్పేస్‌ టెక్‌ ప్రో. దీనిలో పెంటాబోల్డ్‌ ఏరీస్‌, పెంటాబోల్డ్‌ ఈఎక్స్‌ఎస్‌, అల్టిక్స్‌, ఆస్ట్రో వంటివి ఉంటాయి. ఈ భీమా పొందేందుకు వినియోగదారులు ప్యాకేజింగ్‌పై లభ్యమయ్యే క్యుఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడంతో పాటుగా దానికి తగిన జీఎస్‌టీ బిల్లుతో పంపించడం ద్వారా భీమాను యాక్టివేట్‌ చేయవచ్చు. యాక్టివేట్‌ చేసిన నాటి నుంచి సంవత్సరం పాటు ఈ భీమా వర్తిస్తుంది. లాక్‌ కొనుగోలు చేసిన ధరకు 20 రెట్లు భఖీమాను అందించనున్నారు.

also read సామాన్యులకు మరో దెబ్బ.. అక్టోబర్‌లో పెరిగిన టోకు ద్రవ్యోల్బణం.. కారణం ఏంటంటే ?

లిబర్టీతో భాగస్వామ్యం మరియు హోమ్‌ సేఫ్టీ డే గురించి శ్యామ్‌ మొత్వానీ, ఎగ్జిక్యూటివ్‌ వీపీ అండ్‌ హెడ్‌ ఆఫ్‌ బిజినెస్‌, గోద్రేజ్‌లాక్స్‌ మాట్లాడుతూ “ గృహ భద్రత ఆవశ్యకతను ప్రజలకు తెలుపడంలో గోద్రేజ్‌ ఎల్లప్పుడూ ముందే ఉంది. ఎంతోమంది గృహిణిలకు తొలి ప్రాధాన్యతగా మేము ఉంటుంటాం. దశాబ్దాలుగా వారికి నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నాం. హోమ్‌ సేప్టీ డే సందర్భంగా లిబర్జీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కో లిమిటెడ్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. దీనిద్వారా మా వినియోగదారులకు గృహ భద్రత పరంగా అదనపు భద్రతను అందిస్తున్నాం. ఈ భాగస్వామ్యంతో మా అమ్మకాలు 30% వృద్ధి చెందడంతో పాటుగా భారతదేశ వ్యాప్తంగా 50వేలకు పైగా గృహాలపై ప్రభావం చూపనుందని ఆశిస్తున్నాం” అని అన్నారు.

లిబర్టీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కో లిమిటెడ్‌, సీఈఓ అండ్‌ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌ రూపమ్‌ అస్తానా మాట్లాడుతూ “నేటి ప్రపంచం అనిశ్చితిలో ఉంది. గతానికన్నా భీమా ప్రాధాన్యత ఇప్పుడు పెరిగింది. ఈ భాగస్వామ్యంతో లిబర్టీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ వద్ద వినియోగదారులకు దోపిడీల పరంగా ఎలాంటి అభద్రతా భావం ఉన్నా తగ్గించాలని లక్ష్యంగా చేసుకున్నాం...” అని అన్నారు.

హోమ్‌ సేఫ్టీ డేను 2017లో గోద్రేజ్‌ లాక్స్‌ ప్రారంభించింది. అప్పటి నుంచి కంపెనీ హోమ్‌ సేఫ్టీ పట్ల అవగాహన మెరుగుపరచడానికి పలు కార్యక్రమాలను సృష్టిస్తుంది. గత సంవత్సరం గోద్రేజ్‌లాక్స్‌ అధ్యయనం ప్రకారం, 85% మంది పోలీసులు అత్యుత్తమ గృహ భద్రత సాంకేతికతల పట్ల అవగాహన మెరుగుపరచాలని అంగీకరిస్తున్నారు. ఈ సమస్యను గుర్తించి గోద్రేజ్‌ లాక్స్‌ ఇప్పుడు లిబర్టీ తో భాగస్వామ్యం చేసుకుని తమ గృహాలను సురక్షితంగా మలుచుకోవాలనుకునే వినియోగదారులకు ప్రోత్సాహకంగా ఈ భీమాను తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ తరహా నమూనాలు ఆరోగ్య భీమాలోనూ కనిపిస్తున్నాయి.

వినియోగదారుల ఆసక్తి అనుసరించి ఈ భీమాను గోద్రేజ్‌ లాక్స్‌, లిబర్టీ అందిస్తున్నాయి. ఒకవేళ వినియోగదారులు ఈ భీమాను పొడిగించుకోవాలనుకున్నట్లయితే వారు నేరుగా లిబర్జీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కో లిమిటెడ్‌ను సంప్రదించవచ్చు. గోద్రేజ్‌ లాక్స్‌ మరియు లిబర్జీ ఇన్సూరెన్స్‌ నడుమ సహకారం 15 నవంబర్‌ 2021 నుంచి 14 నవంబర్‌ 2022 వరకూ అందుబాటులో ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios