Asianet News TeluguAsianet News Telugu

India’s richest person: ముఖేష్ అంబానీని బీట్ చేసిన గౌత‌మ్ అదానీ !

 India’s richest person: వ్యాపార రంగంలో గౌతమ్ అదానీ దూకుడు కోనసాగుతోంది. దేశంలోనే, కాకుండా ఆసియాలోెనే అత్యంత ధనవంతుడిగా ఉన్న ముఖేష్ అంబానీని సైతం బీట్ చేసే విధంగా ఆదాని వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకుంటున్నారు. ఇప్పుడు భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో అదానీ (Adani) గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్  (Reliance Industries Ltd) అధినేత ముఖేష్ (Mukesh Ambani) అంబానీ రెండో ప్లేస్‌కి వచ్చారు. ఈ మేరకు ఫోర్బ్స్ రియల్ టైమ్ డేటా నెట్‌వర్త్ జాబితాను ప్రకటించింది.

Gautam Adani replaces Mukesh Ambani as Indias richest person
Author
Hyderabad, First Published Jan 27, 2022, 3:15 PM IST

 India’s richest person: వ్యాపార రంగంలో గౌతమ్ అదానీ దూకుడు కోనసాగుతోంది. దేశంలోనే, కాకుండా ఆసియాలోెనే అత్యంత ధనవంతుడిగా ఉన్న రిల‌య‌న్స్ (Reliance Industries Ltd)  అధినేత ముఖేష్‌ అంబానీని సైతం బీట్ చేసే విధంగా ఆదాని వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకుంటున్నారు. ఇప్పుడు భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో అదానీ(Adani) గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ (Mukesh Ambani) అంబానీ రెండో ప్లేస్‌కి వచ్చారు. ఈ మేరకు ఫోర్బ్స్ రియల్ టైమ్ డేటా నెట్‌వర్త్ జాబితాను ప్రకటించింది.  ఈ జాబితాలో భారతదేశపు అత్యంత సంపన్న వ్యక్తిగా ముఖేష్ అంబానీ స్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు. అదానీ ఆదాయ నికర విలువ 89.5 బిలియన్ డాలర్లు కాగా, ముఖేష్ అంబానీ నికర విలువ 89.4 బిలియన్ డాలర్లు ఉంది. దీంతో దేశంలో అత్యంత సంప‌న్నుడిగా గౌత‌మ్ అదాని నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ రెండో స్థానంలో నిలిచారు. 

అదానీ కంపెనీల షేర్ల ధరల పెరుగుదల కారణంగా గత కొన్ని నెలలుగా అదానీ నికర విలువ గణనీయంగా పెరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్‌లో రెండు రోజులుగా భారీ పతనం నమోదవగా.. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పడిపోయాయి. ఈ కారణంగానే ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కి చెందిన రిలయన్స్ గ్రూప్ (Reliance Industries Ltd)  నికర విలువ భారీగా ప‌డిపోయింది. అదే సమయంలో, అదానీ గ్రూప్ షేర్ల దూకుడు కొన‌సాగింది. దీంతో గౌతమ్ అదానీ నికర విలువ  స్థిరంగా కొన‌సాగింది. దీంతో అదానీ దేశంలో రిచెస్ట్ ప‌ర్స‌న్ గా నిలిచారు. భారతదేశంలో అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్ (largest port operator)అదానీ గ్రూప్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. 

ఇటీవల, అదానీ గ్రూప్-దక్షిణ కొరియాకు చెందిన POSCO గుజరాత్‌లోని ముంద్రాలో గ్రీన్, పర్యావరణ అనుకూల ఇంటిగ్రేటెడ్ స్టీల్ మిల్‌ను అలాగే ఇతర వ్యాపారాల స్థాపనతో సహా వ్యాపార సహకార అవకాశాలను అన్వేషించడానికి ప్ర‌త్యేక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో పెట్టుబ‌డి విలువ  USD 5 బిలియన్ల వరకు ఉంటుందని అంచనా. POSCO-అదానీల మధ్య సంతకం చేయబడిన నాన్-బైండింగ్ ఎంఓయూ, కార్బన్ తగ్గింపు అవసరాలకు ప్రతిస్పందనగా పునరుత్పాదక శక్తి, హైడ్రోజన్, లాజిస్టిక్స్ వంటి వివిధ పరిశ్రమలలో గ్రూప్ వ్యాపార స్థాయిలో మరింత సహకరించాలని భావిస్తోంది. అదానీ నికర విలువ ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళ ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ నికర విలువను కూడా అధిగమించింది. మేయర్స్ నికర విలువ $82.9 లియన్లు.

దేశంలో టాప్‌-5 ధ‌న‌వంతులు వీరే (Top five richest persons in India):

పేరు (Name) నికర విలువ(Net worth)
గౌతమ్ అదానీ (Gautam Adani)   $89.5 బిలియ‌న్లు
ముఖేష్ అంబానీ  (Mukesh Ambani)   $89.4 బిలియ‌న్లు
శివ నాడార్ (Shiv Nadar)   $26.6 బిలియ‌న్లు
రాధాకిషన్ దమాని (Radhakishan Damani) $19.9 బిలియ‌న్లు
లక్ష్మీ మిట్టల్ (Lakshmi Mittal)    $18.3 బిలియ‌న్లు

         
         
                 
         
                 $18.3

Follow Us:
Download App:
  • android
  • ios