Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో గౌతమ్ అదానీ.. సంపద ఎంతంటే..?

ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో భారత బిలీయనీర్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ దూసుకుపోతున్నాడు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకార.. గౌతమ్ అదానీ ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. 

Gautam Adani is now worlds third richest person says Bloomberg Billionaires Index
Author
First Published Aug 30, 2022, 9:23 AM IST

ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో భారత బిలీయనీర్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ దూసుకుపోతున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకార.. గౌతమ్ అదానీ ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. 137.4 బిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ..  ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ విషయానికి వస్తే అతడు ఫ్రెంచ్ వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడిగా ఉన్నారు. ఇక, ఆ జాబితాలో గౌతమ్ అదానీ కంటే ముందు మొదటి రెండు స్థానాల్లో.. యూఎస్‌కు చెందిన ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్‌‌లు నిలిచారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ఆసియాకు చెందిన ఒక వ్యక్తి మొదటి మూడు స్థానాల్లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. ఇక, ఇదే జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. 91.9 బిలియన్ డాలర్ల సంపదతో 11వ స్థానంలో నిలిచారు. 

 గత నెలలో విడుదలైన బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టిన గౌతమ్ అదానీ నాలుగో స్థానానికి ఎగబాకారు. ఆ సమయంలో అదానీ సంపద 113 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టుగా ఆ నివేదిక పేర్కొంది. 

అదానీ 2022లోనే తన సంపదకు 60.9 బిలియన్ డాలర్లు జోడించారు. మరోవైపు ఆసియాలో సంపనున్నడిగా ఉన్న ముఖేష్ అంబానీని గౌతమ్ అదానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో అధిగమించారు. ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో సంపద వృద్ది చేసుకున్న వ్యక్తిగా అదానీ నిలిచారు. ఇక, ఏప్రిల్‌లో సెంటిబిలియనీర్ అయ్యారు. ఈ క్రమంలోనే అదానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన యూఎస్ బిలియనీర్‌లలో కొందరిని అధిగమించగలిగారు. ఇందుకు వారు ఇటీవల వారి దాతృత్వాన్ని పెంచుకోవడం కూడా కారణంగా నిలిచింది. గేట్స్ జూలైలో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు 20 బిలియన్ డాలర్లు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. వారెన్ బఫెట్ ఇప్పటికే 35 బిలియన్ డాలర్లుకు పైగా స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చారు.

అదానీ కూడా తన 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని సామాజిక ప్రయోజనాల కోసం 7.7 బిలియన్లను డాలర్లు విరాళంగా ఇస్తానని జూన్‌లో ప్రతిజ్ఞ చేస్తూ తన దాతృత్వాన్ని పెంచుకున్నారు. ఇందుకు సంబంధించి ఆయన ఇంకా ఎలాంటి వివరాలు ఇవ్వలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios