Asianet News TeluguAsianet News Telugu

చేనేత వస్త్రాల కోసం ఇ-స్టోర్.. డిజైనర్ దుస్తులు, ఫ్యాషన్ వస్త్రాలు కూడా..

ఈస్టోర్ వెనుక ఉన్న ఆలోచన పై గౌరాంగ్ మాట్లాడుతూ “ఈ ప్రారంభం బ్రాండ్-కన్స్యూమర్లను మరింతగా విస్తరించేలా చేస్తుంది. తాజా చేతితో నేసిన వస్త్రాలకు  రియల్ టైమ్ యాక్సెస్‌ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇ-కామర్స్ ఉపయోగించి చేనేత కార్మికుల పర్యావరణ వ్యవస్థ, ఇంకా వారి జీవనోపాధికి సహకారం ఇవ్వడానికి మా గొప్ప ప్రయత్నం ఉపయోగపడుతుంది. ”
 

GAURANG Launches eStore for Heritage Hand-Woven Weaves, and to support weaver sustenance
Author
Hyderabad, First Published Jun 4, 2020, 4:05 PM IST

హైదరాబాద్, ఇండియా, జూన్ 04, 2020: హైదరాబాద్ చెందిన అవార్డు విన్నింగ్ టెక్స్‌టైల్స్‌, ఇండియన్ హెరిటేజ్ ఫ్యాషన్ ఇన్నోవేటర్ గౌరంగ్ షా ఇప్పుడు కొత్తగా  ఇ-స్టోర్‌ను ప్రారంభించారు. ఆఫ్‌లైన్ స్టోర్లు లేని ప్రదేశాలలో ఇ-కామర్స్ సైట్ https://shop.gaurang.co గౌరంగ్ బ్రాండ్ ఆభివృద్ధికి సహాయపడుతుంది.
 
అంతే కాకుండా హ్యాండ్‌క్రాఫ్టెడ్ ఫ్యాబ్రిక్స్ కోసం కూడా ఒక ఇ-స్టోర్ను ప్రారంభించాడు. మిల్లు ద్వారా తయారు చేసిన ఫాబ్రిక్స్, ప్రతిభావంతులైన డిజైనర్లను ప్రోత్సహించడానికి ఇన్ స్టోర్ పాప్-అప్ ఎంతో సహాయపడుతుంది.

ఆన్‌లైన్ స్టోర్ అతని కార్మికుల(800+) సంఘానికి, అనేక వందల మంది చేనేతవృత్తులకి మద్దతు ఇస్తుంది. ఈ రోజు వరకు బ్రాండ్ ఉత్పత్తులు 6 ఇండియన్, 2 ఇంటర్నేషనల్ ఫిజికల్‌ స్తోర్లలో మాత్రమే  కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

ఈస్టోర్ వెనుక ఉన్న ఆలోచన పై గౌరాంగ్ మాట్లాడుతూ “ఈ ప్రారంభం బ్రాండ్-కన్స్యూమర్లను మరింతగా విస్తరించేలా చేస్తుంది. తాజా చేతితో నేసిన వస్త్రాలకు  రియల్ టైమ్ యాక్సెస్‌ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇ-కామర్స్ ఉపయోగించి చేనేత కార్మికుల పర్యావరణ వ్యవస్థ, ఇంకా వారి జీవనోపాధికి సహకారం ఇవ్వడానికి మా గొప్ప ప్రయత్నం ఉపయోగపడుతుంది. ”

గౌరాంగ్ సున్నితమైన హస్తకళా జమ్దానీ కళాఖండాలు, చీరల కోసం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. “భారతదేశ జమ్దానీ హస్తకళను మరింత విస్తరించేల మా ఆన్‌లైన్ స్టోర్ కావాలని నేను కోరుకున్నాను. చేనేత వారసత్వాన్ని మరింత ప్రోత్సహించడానికి, సంరక్షించడానికి మా ప్రయత్నాలు ఎంతో బలపరుస్తుంది. ఆన్‌లైన్ షాపింగ్ భారతీయ ఫ్యాషన్ పట్ల వినియోగదారుల కోరికను పెంచడానికి, వారసత్వ దుస్తులను ధరించే శక్తిని పెంచుతుంది. ”

800 పైగా పెరుగుతున్న చేనేత సంఘం మగ్గాలలో తయారు చేసిన విభిన్న పరిమాణాలలోని ఉత్తమమైన, ఆవిష్కరణ ఫాబ్రిక్ ఫ్యూషన్లు, మొటిఫ్స్, రంగు, అల్లికలకు దుకాణదారులకు అక్సెస్ లభిస్తుంది. డిజైనర్ కలెక్షన్ లైన్ ఖాదీ, ముగా సిల్క్, టుస్సార్ సిల్క్, ఆర్గాన్జా, సిల్క్ వంటి వాటిని ప్రస్తుతం కంటెమెంట్ జోన్లు మినహా అన్ని జోన్లలో వీటి డెలివరీలు చేయనున్నారు.  

also read భారత్‌పై ట్రంప్ ఆగ్రహం.. విచారణకు ఆదేశం..

కొత్త ప్రతిభను ప్రోత్సహించడం: కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి గౌరంగ్ ఇప్పుడు హైదరాబాద్ ఇంకా ఇతర నగరాల్లోని తన ప్రధాన స్తోర్లలో ప్రారంభమయ్యే పాప్-అప్ ప్రదర్శనల ద్వారా కొత్త టాలెంట్ వారిని ప్రోత్సహించడంలో, సహాయపడటానికి  ప్రారంభించారు. ఇన్-స్టోర్ పాప్-అప్ షో జూన్ 10 న హైదరాబాద్‌లో 3 రోజుల పాటు ఉంటుంది. దీనిలో అతను 4 టెక్స్‌టైల్ డిజైనర్ల నుండి 100 ప్రత్యేకమైన వాటిని ప్రదర్శిస్తాడు: (ఉజ్జవాల్ దుబే, అంజుల్ భండారి, మయూర్ ఆర్ గిరోత్రా, సాక్షి మెహ్రా) ఉన్నారు.

సున్నితమైన హస్తకళా వస్త్రాలు, మిల్లులో తయారు చేసిన బట్టల కోసం ఒక ఆన్‌లైన్ స్టోర్: గౌరంగ్.కో ప్రారంభించడంతో పాటు, వినియోగదారులకు www.indianemporium.org అనుబంధ బ్రాండ్‌ను కూడా సందర్శించాలి అని గౌరాంగ్ వెల్లడించారు, ఇది చేతితో ఇంకా మిల్లు ద్వారా  తయారు చేసిన బట్టల కోసం బాగా పాపులారిటీ పొందింది.

 కస్టమర్లు ఇప్పుడు కాటన్ సిల్క్స్ చిఫ్ఫోన్ క్రీప్ జార్జెట్ టుస్సార్ మట్కా వంటి వివిధ రకాల రంగుల బట్టల కోసం షాపింగ్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది. ఇండియన్‌పోరియం.కో ద్వారా 1400 కలర్స్ షేడ్స్ నుండి ఎంచుకోవచ్చు ఇంకా అధిక నాణ్యత గల డైయింగ్ సేవలను పొందే అవకాశం ఉంటుంది.

గౌరాంగ్ షా మహానటి సినిమాకి, లక్మే ఫ్యాషన్ వీక్ లో ఉత్తమ ఇండియన్ టెక్స్‌టైల్ డిజైనర్ అవార్డు, ఉత్తమ డ్రెస్ డిజైన్ జాతీయ అవార్డు అందుకున్నారు. ఆలయ ఆర్కిటెక్, వాస్తుశిల్పం, జియోమెట్రి, మైతాలజి నుండి ఆయన ప్రేరణ పొందాడు.

20 సంవత్సరాలుగా, జమ్దానీ చీరల పట్ల తనకున్న ప్రేమను నేటి మహిళలకు ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా వ్యక్తపరుస్తూన్నాడు. అతను డిజైన్ చేసిన వస్త్రాలను సోనమ్ కపూర్, విద్యాబాలన్, తాప్సీ పన్నూ, ఇంకా అనేక ఇతర ప్రముఖులు, ప్రసిద్ధ వ్యక్తులు ధరిస్తారు.


ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్ బ్రాండ్ గౌరాంగ్ ఆఫ్‌లైన్ స్టోర్స్‌ ద్వారా  వినియోగదారులకు డిజైనర్ దుస్తులును  హైదరాబాద్, న్యూ ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబై, యు.కెలోని లండన్‌ & యూ‌ఎస్‌ఏ లోని న్యూయార్క్ నగరంలోని తన స్టోర్ల నుండి విస్తరించడానికి సహాయపడుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios