Asianet News TeluguAsianet News Telugu

todays fuel prices:పెట్రోల్-డీజిల్ ధరలు అప్‌డేట్.. నేడు లీటరు ధర ఎంతంటే..

మహారాష్ట్రలో గత నెల ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 3 చొప్పున వాల్యు ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గింపును ప్రకటించడంతో  ధరల్లో కోత పడింది. వ్యాట్‌లో కోత వల్ల మహారాష్ట్ర రాష్ట్ర ఖజానాకు వార్షిక ప్రాతిపదికన రూ.6,000 కోట్లు నష్టం వాటిల్లనుంది.

Fuel Prices Today On August 8 Check petrol, diesel rates in Delhi Mumbai and your cities
Author
Hyderabad, First Published Aug 8, 2022, 9:46 AM IST

నేడు పెట్రోలు , డీజిల్ ధరలు ఆగస్టు 8న  స్థిరంగా కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర మినహా దేశవ్యాప్తంగా 75 రోజులుగా ఇంధన ధరలు యధావిధిగా ఉన్నాయి. మహారాష్ట్రలో గత నెల ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 3 చొప్పున వాల్యు ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గింపును ప్రకటించడంతో  ధరల్లో కోత పడింది. వ్యాట్‌లో కోత వల్ల మహారాష్ట్ర రాష్ట్ర ఖజానాకు వార్షిక ప్రాతిపదికన రూ.6,000 కోట్లు నష్టం వాటిల్లనుంది. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోలుపై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన మే 21 నుండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 

ఎక్సైజ్ సుంకం తగ్గించడానికి ముందు ఢిల్లీలో పెట్రోలు ధర లీటర్ రూ. 105.41 నుండి ప్రస్తుతం రూ. 96.72 వద్ద ఉంది, డీజిల్ ధర రూ. 96.67 నుండి రూ. 89.62 చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.35 నుండి రూ. 106.31కి, డీజిల్ ధర రూ. 97.28 నుండి రూ. 94.27కి తగ్గింది.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( HPCL) సహా ప్రభుత్వ రంగ  చమురు కంపెనీలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, విదేశీ మారకపు ధరలకు అనుగుణంగా ప్రతిరోజూ ఇంధన ధరలను సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి. VAT లేదా సరుకు రవాణా ఛార్జీల వంటి స్థానిక పన్నుల కారణంగా రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి. ఆగస్టు 2న ప్రభుత్వం డీజిల్ ఎగుమతిపై లీటరుకు రూ. 5కి పన్ను తగ్గించి, ఏటీఎఫ్‌పై పన్నును రద్దు చేసింది. అయితే పెట్రోలియం క్రూడ్‌పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (సెస్) స్వల్పంగా టన్నుకు రూ.17,000 నుంచి రూ.17,750కి పెంచింది. గత నెల ప్రారంభంలో పెట్రోల్ ఎగుమతిపై పన్ను తొలగించబడింది. 

[ప్రముఖ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

ముంబై పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర  లీటరుకు 94.27

ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 96.72, డీజిల్ ధర రూ. 89.62

చెన్నైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 102.63, డీజిల్ ధర రూ. 94.24

కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76

బెంగళూరులో పెట్రోలు లీటరుకు రూ. 101.94, డీజిల్ ధర లీటరుకు రూ. 87.89

లక్నోలో పెట్రోలు లీటరుకు రూ. 96.57, డీజిల్ రూ. 89.76

హైదరాబాద్ లో పెట్రోల్ ధర  లీటరుకు రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82

ముడి చమురు ధర
ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు, ద్రవ్యోల్బణం ఆందోళనల నేపథ్యంలో ముడి చమురు ధరలు తగ్గుతూనే ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 74 సెంట్లు తగ్గి బ్యారెల్ $94.18 వద్ద ట్రేడవుతున్నాయి. రాయిటర్స్ ప్రకారం, WTI క్రూడ్ బ్యారెల్ $ 88.34 వద్ద 67 సెంట్లు తగ్గింది.

ఇంట్లో కూర్చొని మొబైల్  ద్వారా పెట్రోల్, డీజిల్ ధర తెలుసుకోవాలంటే.. మీరు ఈ నంబర్‌ 9224992249కు SMS చేయాలి. ధరలను చెక్ చేయడానికి మీరు RSP<డీలర్ కోడ్>ని ఇండియన్ ఆయిల్ (IOC)కి 9224992249కి పంపాలి. HPCL కస్టమర్ HPPRICE <డీలర్ కోడ్> అని 9222201122కి, BPCL కస్టమర్ RSP<డీలర్ కోడ్> 9223112222కి SMS చేయండి.

Follow Us:
Download App:
  • android
  • ios