Asianet News TeluguAsianet News Telugu

ఇంధన ధరల అప్ డేట్: నేడు హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర ఎంతో చెక్ చేసుకోండీ..

క్రూడాయిల్ గురించి మాట్లాడినట్లయితే ప్రస్తుతం, WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $ 90 డాలర్ల వద్ద, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 95 డాలర్లకి దగ్గరగా ఉంది.  
 

Fuel Prices on November 22: Check petrol diesel rates in Delhi Mumbai and other cities here
Author
First Published Nov 22, 2022, 9:22 AM IST

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో గత 24 గంటల్లో  క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు సుమారు 100 డాలర్లు చేరువలో ఉన్నాయి, అయితే మంగళవారం ఉదయం ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు విడుదల చేసిన పెట్రోల్, డీజిల్ ధరల్లో కాస్త హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. ఈరోజు యూపీ నుంచి బీహార్ వరకు పలు జిల్లాల్లో  పెట్రోల్, డీజిల్ ధరలు పెరగగా, ఢిల్లీ-ముంబై వంటి నాలుగు మెట్రో నగరాలలో ఇంధన రిటైల్ ధరలపై నేటికీ ఎటువంటి ప్రభావం లేదు.

ప్రభుత్వ చమురు కంపెనీలు జారీ చేసిన ధరల ప్రకారం, ఈ ఉదయం గౌతమ్ బుద్ నగర్ జిల్లాలో (నోయిడా-గ్రేటర్ నోయిడా) పెట్రోల్ లీటరుకు 19 పైసలు పెరిగి  రూ. 96.84 వద్ద, డీజిల్‌ 19 పైసలు లీటరుకు రూ. 90.01కి చేరింది. ఘజియాబాద్‌లో కూడా 18 పైసలు పెరిగిన పెట్రోలు ధర లీటరుకి రూ.96.58వద్ద, డీజిల్‌  17 పైసలు పెరిగి రూ.89.75కి చేరింది. బీహార్ రాజధాని పాట్నాలో ఈరోజు పెట్రోల్ ధర 82 పైసలు పెరిగి కొత్త ధర రూ.108.12కి చేరగా, డీజిల్ ధర 77 పైసలు పెరిగి రూ.94.86కి చేరుకుంది.

క్రూడాయిల్ గురించి మాట్లాడినట్లయితే ప్రస్తుతం, WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $ 90 డాలర్ల వద్ద, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 95 డాలర్లకి దగ్గరగా ఉంది.  

నాలుగు మెట్రో నగరాలలో పెట్రోల్-డీజిల్ ధరలు
- ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 96.65, డీజిల్ ధర రూ . 89.82.
 - ముంబైలో పెట్రోల్ ధర రూ. 106.31, డీజిల్ ధర  రూ. 94.27. 
- చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.63, డీజిల్ ధర  రూ.94.24.
-కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ. 92.76.
హైదరాబాద్ లో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర లీటరుకు రూ.97.82.

ఈ నగరాల్లో కొత్త ధరలు 
- నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.84, డీజిల్ ధర లీటరుకు రూ. 90.01.
– లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76గా ఉంది.
– పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.12, డీజిల్ ధర రూ.94.86కి చేరింది.
– ఘజియాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.58, డీజిల్‌ ధర రూ.89.75గా ఉంది.

 ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తుంటారు. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం.

వ్యాట్ వంటి స్థానిక పన్నులు, రాష్ట్రాల నుండి రాష్ట్రానికి సరుకు రవాణా ఛార్జీలు వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభావితం చేస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios