Asianet News TeluguAsianet News Telugu

పడిపోతున్న క్రూడాయిల్.. నేటి పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు ఇవే.. లీటరు ధర ఎంతంటే..?

నేడు బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0119 GMT నాటికి 17 సెంట్లు లేదా 0.2 శాతం పడిపోయి బ్యారెల్‌కు $83.86డాలర్లకి చేరుకుంది, అయితే US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ 12 సెంట్లు లేదా 0.2 శాతం పడిపోయి $78.27డాలర్లకి పడిపోయాయి.

Fuel Prices on January 13 Check petrol diesel rates in Delhi Mumbai and other cities here
Author
First Published Jan 13, 2023, 9:05 AM IST

నేడు ఇంధన ధరలు వరుసగా 237వ రోజు శుక్రవారం అంటే జనవరి 13 న మారలేదు . గత ఏడాది 2022 మే 21న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన మరుసటి రోజు మే 22న దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు చివరిసారిగా తగ్గాయి. ఈ తగ్గింపు తరువాత కొన్ని  రాష్ట్ర ప్రభుత్వలు 14 జూలై 2022న పెట్రోల్, డీజిల్‌పై   విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించబడ్డాయి.

ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.ఆర్ధిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31గా ఉండగా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది.

కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, లీటర్ డీజిల్ ధర రూ.92.76. కాగా, చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉన్నాయి. బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0119 GMT నాటికి 17 సెంట్లు లేదా 0.2 శాతం పడిపోయి బ్యారెల్‌కు $83.86డాలర్లకి చేరుకుంది, అయితే US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ 12 సెంట్లు లేదా 0.2 శాతం పడిపోయి $78.27డాలర్లకి పడిపోయాయి. దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థానిక పన్నుల బట్టి రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.

ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విదేశీ మారకపు రేట్లు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను సవరిస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios