Asianet News TeluguAsianet News Telugu

పెట్రోలు, డీజిల్ ధరలు సంక్రాంతికి పెరుగుతాయా, తగ్గుతాయా ? నేడు లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

క్రూడాయిల్ ధరల గురించి మాట్లాడినట్లయితే గత 24 గంటల్లో ధరలలో పెరుగుదల కనీస్తుంది. బ్రెంట్ క్రూడ్ ఈ ఉదయం సుమారు $ 2 డాలర్లు పెరిగి బ్యారెల్‌కు $82.70 డాలర్లకి చేరుకుంది. WTI ధర కూడా దాదాపు $2.25 పెరిగి బ్యారెల్‌కు $77.25డాలర్లకి చేరుకుంది.
 

Fuel Prices on December 15: Check petrol diesel rates in Delhi Mumbai and other cities here
Author
First Published Dec 15, 2022, 9:33 AM IST

భారతదేశంలో ఇంధన ధరలు చాలా కాలంగా స్థిరంగా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వ చమురు సంస్థలు విడుదల చేసిన ధరల ప్రకారం డిసెంబర్ 15న పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అన్ని మెట్రోల నుండి వివిధ రాష్ట్రాలలో వాహన ఇంధన ధరలు ఒకే విధంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర పడిపోయిన తర్వాత కూడా మే 21 నుంచి జాతీయ మార్కెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో పెద్దగా ఎలాంటి మార్పు లేదు.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు (గురువారం) లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, లీటర్ డీజిల్ ధర రూ.89.62. ఘజియాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.96.58, డీజిల్ ధర రూ.89.75 వద్ద స్థిరంగా ఉంది. పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోల్, డీజిల్ అత్యంత తక్కువ ధరకు లభిస్తుంది. ఇక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది. మరోవైపు మెట్రో నగరాల గురించి మాట్లాడితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) అధికారిక వెబ్‌సైట్ iocl.com తాజా అప్‌డేట్ ప్రకారం, చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.63, డీజిల్ ధర లీటరుకు రూ. 94.24 వద్ద స్థిరంగా ఉంది.

 కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. అంతేకాకుండా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటరు పెట్రోలు రూ.106.31, డీజిల్ ధర రూ.94.27. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలని బట్టి  ప్రభుత్వ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సమీక్షించిన తర్వాత ధరలను నిర్ణయిస్తాయి. అయితే చాలా కాలంగా పెట్రోలు, డీజిల్ ధరల్లో ఆయిల్ కంపెనీలు ఎలాంటి మార్పులు చేయలేదు.

రాష్ట్ర స్థాయిలో విధించే పన్ను కారణంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు వేర్వేరుగా ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు వరుసగా రెండో రోజు బ్యారెల్‌కు 2 డాలర్లు ఎగబాకాయి.

హైదరాబాద్: లీటరు పెట్రోల్ ధర  రూ.109.66. డీజిల్ ధర లీటరుకి రూ.97.82

క్రూడాయిల్ ధరల గురించి మాట్లాడినట్లయితే గత 24 గంటల్లో ధరలలో పెరుగుదల కనీస్తుంది. బ్రెంట్ క్రూడ్ ఈ ఉదయం సుమారు $ 2 డాలర్లు పెరిగి బ్యారెల్‌కు $82.70 డాలర్లకి చేరుకుంది. WTI ధర కూడా దాదాపు $2.25 పెరిగి బ్యారెల్‌కు $77.25డాలర్లకి చేరుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios