Asianet News TeluguAsianet News Telugu

నేడు పెట్రోల్-డీజిల్ కొత్త ధరలు ఇవే.. లీటరు ధర పెరిగిందా తగ్గిందా ఒక్క క్లిక్‌తో ఇలా తెలుసుకోండి..

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు, దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు వాహన ఇంధన కొత్త రేట్లను అప్‌డేట్ చేస్తాయి. ధరలలో ఏదైనా మార్పు ఉంటే  సవరిస్తుంది. 

Fuel prices on April 26: Petrol diesel rates remain unchanged across major cities in india-sak
Author
First Published Apr 26, 2023, 9:24 AM IST

నేడు 26 ఏప్రిల్ 2023న  ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను ప్రకటించాయి దింతో ఈ రోజు కూడా ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ సవరించిన ఇంధన ధరలను ప్రకటిస్తాయి. నేడు  ఏప్రిల్ 26న ప్రకటించిన ధరల ప్రకారం  పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. అంటే దాదాపు ఏడాది కాలంగా  ఇంధన ధరల్లో  ఎలాంటి మార్పు లేదు. గత ఏడాది మే 22న పెట్రోల్, డీజిల్ ధరల్లో చివరిసారి  మార్పు  జరిగింది. 

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు, దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు వాహన ఇంధన కొత్త రేట్లను అప్‌డేట్ చేస్తాయి. ధరలలో ఏదైనా మార్పు ఉంటే  సవరిస్తుంది. ఈరోజు ప్రకటించిన ధరల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, లీటర్ డీజిల్ ధర రూ.89.62గా ఉంది. 

0006 GMT నాటికి, బ్రెంట్ క్రూడ్ 16 సెంట్లు లేదా 0.2 శాతం పెరిగి USD 80.93 వద్ద ట్రేడవుతోంది. యునైటెడ్ స్టేట్స్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 25 సెంట్లు పెరిగి USD 77.32కి చేరుకున్నాయి.

హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర లీటరుకు రూ.97.82

పోర్ట్ బ్లెయిర్‌లో  పెట్రోల్, డీజిల్ అతితక్కువగా ఉన్నాయి. ఇక్కడ పెట్రోలు ధర రూ.84.10, డీజిల్ లీటరు ధర రూ.79.74గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. రాష్ట్ర స్థాయిలో పెట్రోల్‌పై విధించే పన్ను కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. 

కాగా నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.79, డీజిల్  ధర రూ.89.96గా ఉంది. ఘజియాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.96.58, డీజిల్ ధర రూ.89.75గా ఉంది. గురుగ్రామ్‌లో పెట్రోల్ ధర రూ.97.18, డీజిల్ ధర లీటరుకు రూ.90.05గా ఉంది.  

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు కొత్త రేట్లు 
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లు ప్రకటిస్తారు. పెట్రోలు, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ అండ్ ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. అందుకే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios