Asianet News TeluguAsianet News Telugu

నేటి కొత్త ఇంధన ధరలు ఇవే.. లీటరు ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టింది. WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $78కి, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $85కి పడిపోయింది.
 

fuel Price Update: New petrol diesel prices announced know whether rates have increased or decreased
Author
First Published Dec 5, 2022, 9:01 AM IST

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుతున్న నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నేడు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను విడుదల చేశాయి. అయితే, భారతీయ ఆయిల్ కంపెనీలు సోమవారం అంటే డిసెంబర్ 5న పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా కొనసాగించాయి.

భారతదేశంలో నేడు వరుసగా 197వ రోజు పెట్రోలు, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టింది. WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $78కి, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $85కి పడిపోయింది.

అంతకుముందు మే 21న ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 దిగోచ్చింది.  కేంద్రం ప్రకటన తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ని తగ్గించాయి.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.


రాజస్థాన్‌లోని గంగానగర్‌, హనుమాన్‌గఢ్‌ జిల్లాల్లో పెట్రోల్‌, డీజిల్‌ అత్యధికంగా ఉన్నాయి. గంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113.48, డీజిల్‌ ధర రూ.98.24. హనుమాన్‌గఢ్‌ జిల్లాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.112.54కు, డీజిల్‌ ధర రూ.97.39.

 పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 84.10, డీజిల్ ధర లీటరుకు రూ.79.74గా ఉంది.

నేటి పెట్రోల్ డీజిల్ ధర ఎంతంటే ?

ఢిల్లీ: లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62.

ముంబై: లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27.

కోల్‌కతా: లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76.

చెన్నై: లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24.

హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర  రూ.97.82.

బెంగళూరు: లీటర్ పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89.

తిరువనంతపురం: లీటర్ పెట్రోల్ ధర రూ.107.71, డీజిల్ ధర రూ.96.52.

పోర్ట్ బ్లెయిర్: లీటర్ పెట్రోల్ ధర రూ. 84.10, డీజిల్ ధర రూ.79.74.

భువనేశ్వర్: లీటర్ పెట్రోల్ ధర రూ.103.19, డీజిల్ ధర రూ.94.76.

చండీగఢ్: లీటర్ పెట్రోల్ ధర రూ.96.20, డీజిల్ ధర రూ.84.26.

లక్నో: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76.

నోయిడా: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.96.

జైపూర్: లీటర్ పెట్రోల్ ధర రూ.108.48, డీజిల్ ధర రూ.93.72.

పాట్నా: లీటర్ పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04

 ఎక్సైజ్‌ డ్యూటీ, డీలర్‌ కమీషన్‌, ఇతర చార్జీలు కలిపితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అసలు ధర కంటే  దాదాపు రెట్టింపు అవుతాయి. విదేశీ మారకపు ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ సమీక్షిస్తుంటారు.

 పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ ఉదయం సమీక్షించిన తరువాత ఏవైనా మార్పులు ఉంటే ఉదయం 6 గంటల నుండి అమలు చేస్తాయి. మీరు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు మీ సిటీ కోడ్‌తో పాటు RSPని టైప్ చేసి 9224992249 నంబర్‌కు, BPCL కస్టమర్‌లు RSPని టైప్ చేసి మీ సిటీ కోడ్ ఎంటర్ చేసి  9223112222 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios