Asianet News TeluguAsianet News Telugu

మీ వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ పోయిస్తున్నారా.. నేడు మీ నగరంలో తాజా ఇంధన ధరలు ఎంతో తెలుసుకోండి..

నేటికీ భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేకుండా వరుసగా 232వ రోజు.  అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టింది. WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $78కి, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $85కి పడిపోయింది.

fuel  Price Update: Know latest petrol, diesel prices in your city here
Author
First Published Jan 7, 2023, 9:08 AM IST

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర పెరుగుతూ పడిపోతున్న నేపథ్యంలో భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నేడు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను విడుదల చేశాయి. అయితే భారతీయ ఆయిల్ కంపెనీలు శనివారం జనవరి 7న పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా కొనసాగించాయి.

నేటికీ భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేకుండా వరుసగా 232వ రోజు.  అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టింది. WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $78కి, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $85కి పడిపోయింది.

అంతకుముందు మే 21న ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి మీకు తెలిసిందే. దీంతో లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున తగ్గింది. అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. కేంద్రం ప్రకటన తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ని తగ్గించాయి.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.

 రాజస్థాన్‌లోని గంగానగర్‌, హనుమాన్‌గఢ్‌ జిల్లాల్లో  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యధికంగా ఉన్నాయి. గంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113.48, డీజిల్‌ ధర రూ.98.24. హనుమాన్‌గఢ్‌ జిల్లాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.112.54కు, డీజిల్‌ ధర రూ.97.39.

ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు పోర్ట్ బ్లెయిర్‌లో  అత్యంత తక్కువ ధరకు లభిస్తున్నాయి, ఇక్కడ పెట్రోల్ ధర లీటరుకు రూ. 84.10, డీజిల్ ధర లీటరుకు రూ.79.74గా ఉంది.

నేటి పెట్రోల్ డీజిల్ ధర ఎంతంటే ?

హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

బెంగళూరు: లీటర్ పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89.

తిరువనంతపురం: లీటర్ పెట్రోల్ ధర రూ.107.71, డీజిల్ ధర రూ.96.52.

భువనేశ్వర్: లీటర్ పెట్రోల్ ధర రూ.103.19, డీజిల్ ధర రూ.94.76.

చండీగఢ్: లీటర్ పెట్రోల్ ధర రూ.96.20, డీజిల్ ధర రూ.84.26.

లక్నో: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76.

నోయిడా: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.96.

జైపూర్: లీటర్ పెట్రోల్ ధర రూ.108.48, డీజిల్ ధర రూ.93.72.

పాట్నా: లీటర్ పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04

గురుగ్రామ్: లీటర్ పెట్రోల్ ధర రూ. 97.18, డీజిల్ ధర రూ. 90.05 లీటరు.

 ఎక్సైజ్‌ డ్యూటీ, డీలర్‌ కమీషన్‌, ఇతర చార్జీలు కలిపితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలుఅసలు ధర కంటే  దాదాపు రెట్టింపు అవుతాయి. విదేశీ మారకపు ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి.

Follow Us:
Download App:
  • android
  • ios