గత కొద్దిరోజులుగా ఇంధన ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజు రాష్ట్ర చమురు కంపెనీలు పెంచాయి.

నేడు  డీజిల్ ధర 35 నుండి 38 పైసలకు పెరిగింది, అలాగే పెట్రోల్ ధర కూడా 28 నుండి 29 పైసలకు పెరిగింది. ఢీల్లీ, ముంబైలలో పెట్రోల్ ధరలు ఎప్పటికప్పుడు గరిష్ట స్థాయికి చేరాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం  కొత్త ఎత్తులకు చేరుకున్నాయి.  

ఢీల్లీలో పెట్రోల్  ధర ఆల్ టైం గరిష్టానికి రూ .88.14కు చేరుకోగా, ముంబైలో పెట్రోల్ లీటరుకు  రూ.94.64 చేరుకుంది. అలాగే ఢీల్లీలో డీజిల్‌  ధర రూ .78.38, ముంబైలో రూ .85.32 కు పెంచారు.

ఈ ఏడాది ఇప్పటివరకు పెట్రోల్ రూ .4.24, డీజిల్ రూ .4.15 పెరిగాయి.   ఫిబ్రవరిలో ధరలు పెరగడం 6వ సారి. దీంతో ఢిల్లీలో పెట్రోల ధర  88 రూపాయల మార్క్‌ను అధిగమించాయి.

ప్రధాన మెట్రోలలో ఇంధన ధరలు

ఐఓసిఎల్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, నేడు ఢీల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ఒక లీటర్ పెట్రోల్, డీజిల్ ధర ఈ క్రింది విధంగా ఉన్నాయి..
  
నగరం          డీజిల్    పెట్రోల్
ఢీల్లీ               78.38    88.14
కోల్‌కతా          81.96    89.44
ముంబై           85.32    94.64
చెన్నై             83.52    90.44
హైదరాబాద్‌   85.50    91.65