గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారులని ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరుసగా 10వ రోజు కూడా ధరలు పెరగడంతో  నేడు పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. నేడు, డీజిల్ ధర 32 నుండి 34 పైసలకు పెరిగగా, పెట్రోల్ ధర కూడా 32 నుండి 34 పైసలకు పెరిగింది.


ఢీల్లీ, ముంబైలలో పెట్రోల్ ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు నగరాల్లో పెట్రోల్ అత్యధిక స్థాయిలో ఉంది. దీంతో ఢీల్లీలో పెట్రోల్ ధర రూ .89.88 కు చేరుకోగా, ముంబైలో లీటరుకు రూ.96.32 చేరుకుంది.

రోజుకు 25-30 పైసల చొప్పున పెట్రోలు ధర పెరుగుతూ పోతే మరో ఆరు నెలల్లో ఇంధన ధరలు లీటరుకు 150 రూపాయలకు చేరే అవకాశం ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇప్పటికే రాజస్థాన్‌లోని  కొన్ని ప్రాంతాల్లో  పెట్రోల్ ధర రూ.100 దాటేసిన సంగతి తెలిసిందే. మరోవైపు  వరుసగా పెరుగుతున్న ధరలపై  ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 

also read ప్రపంచవ్యాప్తంగా చైనా స్టేటస్ ఎందుకు పెరుగుతోంది ? అమెరికన్లు అక్కడ ఎందుకు పెట్టుబడులు పెడుతున్నారు....

 ఐఓసిఎల్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, నేడు ఢీల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ఒక లీటర్ పెట్రోల్, డీజిల్ ధర ఈ క్రింది విధంగా ఉన్నాయి 
  
నగరం    డీజిల్    పెట్రోల్
ఢీల్లీ        80.27    89.88
కోల్‌కతా    83.86    91.11
ముంబై    87.32    96.32
చెన్నై     85.31    91.98
హైదరాబాద్‌ 87.55   93.45

ప్రతిరోజూ  ఉదయం ఆరు గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలు మారుతుంటాయి. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్ మరియు ఇతర వస్తువులను జోడించిన తరువాత, దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ ప్రమాణాల ఆధారంగా, చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయి.