Asianet News TeluguAsianet News Telugu

నేడు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు ఇవే.. ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు 1లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు నేటికీ పెరుగుతూనే ఉన్నాయి.  దీంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు $ 85డాలర్లకి చేరువైంది. ఇదిలా ఉండగా ఢిల్లీ-ముంబై వంటి దేశంలోని నాలుగు ప్రముఖ మెట్రో నగరాల్లో  ఇంధన  ధరల్లో  ఎలాంటి మార్పు లేదు.

fuel Price Today: How much money will have to be paid for 1L petrol-diesel  know todays latest price
Author
First Published Jan 16, 2023, 9:24 AM IST

గత కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నేడు జనవరి 16న ఇండియాలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్, డీజిల్ ధరల తాజా ధరలను విడుదల చేశాయి. మరోవైపు గత ఏడాది మే 22 నుంచి ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.   

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు నేటికీ పెరుగుతూనే ఉన్నాయి.  దీంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు $ 85డాలర్లకి చేరువైంది. ఇదిలా ఉండగా ఢిల్లీ-ముంబై వంటి దేశంలోని నాలుగు ప్రముఖ మెట్రో నగరాల్లో  ఇంధన  ధరల్లో  ఎలాంటి మార్పు లేదు.

క్రూడాయిల్ గురించి మాట్లాడుతూ, గత 24 గంటల్లో వాటి ధరలు కూడా జంప్ చూపిస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఈరోజు బ్యారెల్‌కు $84.90 డాలర్లకు చేరుకుంది. WTI ధర కూడా బ్యారెల్‌కు  $ 0.30 పెరిగి $ 79.56కి చేరుకుంది.

ఈ రోజు ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా,  డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై  రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు.

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి, కొన్ని రాష్ట్రాలు ఇంధన ధరలపై వ్యాట్ ధరలను కూడా తగ్గించాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం జనవరి 8న డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని లీటరుకు రూ.3 పెంచింది.  మరోవైపు పెట్రోల్‌పై ప్రభుత్వం 0.55 పైసలు పన్నును తగ్గించింది.  

చెన్నై: పెట్రోలు ధర  లీటరుకు రూ 102.63, డీజిల్ ధర  రూ 94.24

కోల్‌కతా: పెట్రోలు ధర లీటరుకు రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76

బెంగళూరు: పెట్రోలు ధర లీటరుకు రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89

లక్నో: పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76

నోయిడా: పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.79, డీజిల్ ధర రూ. 89.96

గురుగ్రామ్: పెట్రోల్ ధర లీటరుకు రూ. 97.18, డీజిల్ ధర రూ. 90.05

చండీగఢ్: పెట్రోలు ధర లీటరుకు రూ. 96.20, డీజిల్ ధర రూ. 84.26

హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతుంటాయి. ఇంకా విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు ( IOCL)  హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజూ ధరలను సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios