వరుసగా మూడు రోజుల పాటు స్థిరంగా ఉన్న ఇంధన ధరలలో నేడు మార్పు వచ్చింది. ప్రస్తుతం డీజిల్ ధర 24 నుంచి 27 పైసలు పెరగగా, పెట్రోల్ ధర 23 నుంచి 25 పైసలకు పెరిగింది.

భారతదేశంలో ఇంధన ధరలు సోమవారం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. వరుసగా మూడు రోజుల పాటు స్థిరంగా ఉన్న ఇంధన ధరలలో నేడు మార్పు వచ్చింది.

ప్రస్తుతం డీజిల్ ధర 24 నుంచి 27 పైసలు పెరగగా, పెట్రోల్ ధర 23 నుంచి 25 పైసలకు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం పెట్రోల్ ధర లీటరుకు రూ.84.95 వద్ద విక్రయిస్తుండగా, డీజిల్ ధర లీటరుకు రూ.75.13 వద్ద రిటైల్ అవుతోంది. దేశ రాజధానిలో రవాణా ఇంధనానికి ఇది అత్యధిక ధర.

పెట్రోల్ రిటైల్ ధరను గత 29 రోజుల పాటు స్థిరంగా ఉన్న తరువాత, భారతదేశంలో ఓ‌ఎం‌సిలు జనవరిలో ధరలను పెంచడం ప్రారంభించాయి. 

also read ఫోన్ కాల్స్‌ చేసే ముందు '0’ నొక్కడం తప్పనిసరి.. కస్టమర్లను కోరిన టెలికాం కంపెనీలు.. ...

దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో ఐఓసిఎల్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఢీల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర ఈ క్రింది విధంగా ఉన్నాయి.

నగరం డీజిల్ పెట్రోల్
ఢీల్లీ 75.13 84.95

కోల్‌కతా 78.72 86.39

ముంబై 81.87 91.56

చెన్నై 80.43 87.63

హైదరాబాద్ 81.17 88.11