పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి.  దీంతో  శనివారం ఆకాశాన్ని తాకిన ఇంధన  ధరలు  దేశీయంగా  సరికొత్త రికార్డును చేరాయి.  ఈ వారంలో రెండు రోజులు స్థిరంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో  లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయించాయి.  

దీంతో వాహనదారులు ఆందోలనా వ్యక్తం చేస్తున్నారు. నేడు డీజిల్ ధర 18 నుంచి 26 పైసలు పెరగగా, పెట్రోల్ ధర కూడా 22 నుంచి 25 పైసలకు పెరిగింది. ఢీల్లీ, ముంబైలలో పెట్రోల్ ధరలు ఎప్పటికప్పుడు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

దేశ రాజధాని ఢీల్లీలో పెట్రోల్ ధర ఇప్పుడు లీటరుకు రూ. 85.70 చేరగా, డీజిల్ లీటరుకు 15 పైసల పెంపుతో రూ.. 75.88 గా చేరింది. శుక్రవారం రోజున ఢీల్లీలో ఒక లీటరు పెట్రోల్ ధర. 85.45 కాగా, డీజిల్ ధర రూ.75.63గా ఉంది.

భోపాల్‌లో తాజా పెంపుతో  పెట్రోల్ ధర లీటరుకు రూ.93.59 కు, డీజిల్ ధర లీటరుకు రూ. 83.85 కు పెరిగింది.  ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.92.28కు, డీజిల్ ధర లీటరుకు 82.66కు చేరింది.

also read భగ్గుమంటున్న ఇంధన ధరలు.. నేడు పెట్రోల్, డీజిల్ ధర మళ్ళీ పెంపు.. ...

కోల్‌కతాలో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.87.11, డీజిల్‌ ధర లీటరుకు రూ.79.48 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.88.29, డీజిల్ ధర రూ.81.14.

అక్టోబర్ 4, 2018 న ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నప్పుడు ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడానికి, వినియోగదారుల విశ్వాసాన్ని పెంచడానికి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 1.50 తగ్గించింది.

దానితో పాటు, ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు లీటరుకు మరో 1 రూపాయి ధరలను తగ్గించారు.
 
పెట్రోల్ మరియు డీజిల్ ధరలను అంతర్జాతీయ ధర మరియు విదేశీ మారక రేట్ల ప్రకారం రోజువారీగా సవరించబడతాయి. స్థానిక పన్నుల బట్టి అవి ప్రతి రాష్ట్రానికి మారుతాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.88.89, డీజిల్ ధర రూ.82.26.