రాష్ట్ర చమురు కంపెనీలు వరుసగా మూడవ రోజు  కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. నేడు డీజిల్ ధర 30 నుండి 31 పైసలకు పెరిగగా, పెట్రోల్ ధర కూడా 24 నుండి 25 పైసలకు పెరిగింది.

ఢీల్లీ, ముంబై నగరాలలో పెట్రోల్ ధరలు ఎప్పటికప్పుడు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం రోజున కూడా  కొత్త ఎత్తులకు చేరుకున్నాయి. రెండు ఇంధనాల ధరలు వరుసగా పెరగటం ఇది మూడవసారి.  

దేశ రాజధాని ఢీల్లీలో పెట్రోల్ లీటరు ధర ఆల్ టైం గరిష్టానికి రూ.87.85 కు చేరుకోగా, ముంబైలో  పెట్రోల్ లీటరుకు రూ.94.36కు చేరింది.  డీజిల్‌ ధర  ఢీల్లీలో లీటరుకు రూ .78.03 చేరగా, ముంబైలో రూ.84.94 కు చేరింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పెట్రోల్ పై రూ .3.89, డీజిల్ రూ.3.86 పెరిగాయి. 

దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో  ఇంధన ధరలు 
ఐఓసిఎల్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, నేడు ఢీల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ఒక లీటర్ పెట్రోల్, డీజిల్ ధర ఈ క్రింది విధంగా ఉన్నాయి

also read మార్చి 15, 16న బ్యాంకుల సమ్మె.. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన.. ...
  
నగరం    డీజిల్    పెట్రోల్
.ిల్లీ    78.03    87.85
కోల్‌కతా    81.61    89.16
ముంబై    84.94    94.36
చెన్నై    83.18    90.18
హైదరాబాదు  85.11      91.35 

మరోవైపు ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజు సవరిస్తారు. కొత్త రేట్లు ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర  జోడించిన తరువాత, దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది.