నేడు డీజిల్ ధర 33 నుండి 35 పైసలకు, పెట్రోల్ ధర కూడా 30 నుండి 31 పైసలకు పెంచింది. ధరల పెరుగుదల తరువాత దేశ రాజధాని ఢీల్లీలో పెట్రోల్ ధర తొలిసారిగా రూ .90 దాటింది.
ప్రభుత్వ చమురు కంపెనీల వరుసగా 11వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. నేడు డీజిల్ ధర 33 నుండి 35 పైసలకు, పెట్రోల్ ధర కూడా 30 నుండి 31 పైసలకు పెంచింది. ధరల పెరుగుదల తరువాత దేశ రాజధాని ఢీల్లీలో పెట్రోల్ ధర తొలిసారిగా రూ .90 దాటింది.
ఢీల్లీ, ముంబై నగరాలలో పెట్రోల్ ధరలు రోజురోజుకి గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ రెండు నగరాల్లో పెట్రోల్ ధర అత్యధిక స్థాయిలో ఉంది. ప్రస్తుతం ఢీల్లీలో పెట్రోల్ ధర రూ .90.19 ఉండగా, డీజిల్ ధర రూ .80.60కి చేరుకుంది.
ముంబైలో పెట్రోల్ ధర రూ .96.62 కు, డీజిల్ ధర లీటరుకు రూ .87.67 కు చేరుకుంది.
ఐఓసిఎల్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, నేడు ఢీల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ఒక లీటర్ పెట్రోల్, డీజిల్ ధర ఈ క్రింది విధంగా ఉన్నాయి.
also read మండుతున్న ఇంధన ధరలు.. వరుసగా 10వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. ...
నగరం డీజిల్ పెట్రోల్
ఢీల్లీ 80.60 90.19
కోల్‌కతా 84.19 91.41
ముంబై 87.67 96.62
చెన్నై 85.63 92.25
హైదరాబాద్ 87.91 93.78
మరోవైపు ఇప్పటికే రాజస్థాన్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.100 దాటేసింది. కాగా గురువారం మధ్యప్రదేశ్‌లో కూడా పెట్రోల్ ధర లీటరుకు 100రూపాయల మార్క్‌ను అధిగమించింది. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.100.25 దాటేసింది. నేడు ఇక్కడ పెట్రోలు ధర రూ.100.57 వద్ద, డీజిల్ 91.04 వద్ద కొనసాగుతున్నాయి.
గురువారం రోజున కూడా పెట్రోల్ ధరపై 34 పైసలు, డీజిల్ ధరపై 32 పైసలు పెంచారు. స్థానిక పన్నును బట్టి వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలో తేడా ఉంటుంది.
పెట్రోల్‌పై రాజస్థాన్‌లో అత్యధిక వ్యాట్ ఉంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో అత్యధిక పన్ను ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలకు భారతదేశం దిగుమతులపై ఆధారపడటంలో 85 శాతానికి పైగా ఉందని ప్రధాని మోడీ ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్ ధర ఉదయం ఆరు గంటలకు సావరిస్తారు. కొత్త ధర ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్ మరియు ఇతర వస్తువులను జోడించిన తరువాత, దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ ప్రమాణాల ఆధారంగా, చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయింస్తాయి.
