భారతదేశంలో ఇంధన ధరలు  వాహన వినియోగదారులను వణికిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా ఏడవ రోజు కూడా రాష్ట్ర చమురు కంపెనీలు సవరించాయి.

నేడు డీజిల్ ధర పై 29 నుంచి 30 పైసలకు పెరగగా, పెట్రోల్ ధర పై  25 నుంచి 26 పైసలు పెంచింది.  దీంతో ఢీల్లీ, ముంబైలలో పెట్రోల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు నగరాల్లో పెట్రోల్ ధర ఎప్పుడు లేని విధంగా అత్యధిక స్థాయికి చేరుకుంది.

ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.88.99 కు చేరుకోగా, ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు 95.46 రూపాయలకు పెరిగింది. అలాగే డీజిల్‌ ధర ఢీల్లీలో రూ .79.35 ఉండగా, ముంబైలో రూ.86.34 వద్ద ఉంది. గత ఏడు రోజుల్లో పెట్రోల్ ధర లీటరుపై రూ.2.06, డీజిల్ పై రూ .2.27 పెరిగింది.

 దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో ఇంధన  ధరలు 
ఐఓసిఎల్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం నేడు ఢీల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ఒక లీటర్ పెట్రోల్, డీజిల్ ధర ఈ క్రింది విధంగా ఉన్నాయి..

also read తండ్రి అంత్యక్రియలకు 600 కోట్ల ఖర్చు.. ఈ రాజు సంపద తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ...
  
నగరం    డీజిల్    పెట్రోల్
ఢీల్లీ         79.35    88.99
కోల్‌కతా    82.94    90.25
ముంబై    86.34    95.46
చెన్నై      84.44    91.19
హైదరాబాద్‌  86.55  92.53 

ఢీల్లీలో ఆదివారం పెట్రోల్ ధర లీటరుకు రూ .88.73, డీజిల్  రూ .79.06 వద్ద అమ్ముడైంది. దేశవ్యాప్తంగా ఇంధనంపై అత్యధిక వ్యాట్ రాజస్థాన్‌లో ఉంది. ఈ కారణంగా  అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉంటాయి.  
 
ప్రస్తుతం ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ .88.73, ప్రీమియం పెట్రోల్ ధర  రూ .91.56, డీజిల్ లీటరుకు  79.06, గ్రేడెడ్ డీజిల్ ధర రూ .82.35.

అదేవిధంగా ముంబైలో పెట్రోల్ ధర రూ .95.21, డీజిల్ లీటరుకు రూ .86.04. అలాగే ప్రీమియం పెట్రోల్ రూ .97.99, గ్రేడెడ్ డీజిల్ లీటరుకు రూ .89.27. గత ఆరు రోజుల్లో దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర రూ .1.80, డీజిల్‌కు రూ .1.88 పెరిగింది. 

పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు సావరిస్తారు. కొత్త ధరలు కూడా ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలపై  ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర  జోడించిన తరువాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది.

ఈ  ప్రమాణాల ఆధారంగా, చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయింస్తాయి. డీలర్లు పెట్రోల్ పంపులను నడుపుతున్న వ్యక్తులు. పన్నులు, వారి స్వంత మార్జిన్లను జోడించిన తరువాత  రిటైల్ ధరలకు వినియోగదారులకు అమ్ముతారు.